విడాకుల దిశగా నటి సంజనా గల్రానీ వైవాహిక బంధం?
కన్నడ భామ సంజనా గల్రానీ విడాకులు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆమె స్పందించారు. తమ వైవాహిక జీవితం చాలా బాగుందని చెప్పారు. తమ వైవాహిక బంధం గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
కాగా, కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో రిలీజ్ అయ్యారు. ఈ డ్రగ్స్ కేసు ఆమె సినీ కెరీర్‍పై తీవ్ర ప్రభావం చూపింది. సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
ఈ క్రమంలో తన ప్రియుడిని పెళ్లాడింది. అయితే, ప్రస్తుతం ఆమె గర్భందాల్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో తన భర్తతో తెగదెంపులు చేసుకోబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కన్నడ మీడియాలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
దీంతో ఆమె స్పందించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తమ వైవాహిక జీవితం హాయిగా సాగిపోతుందని చెప్పారు. తమ వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరూ తొంగిచూడొద్దని ఆయన హితవు పలికారు.