అమ్మాయి వదిలేసిందని ఏడ్చిన నేను.. ఇక్కడ ఇద్దరమ్మాయిలతో తిరుగుతూ... 'హిప్పి' హీరో
RX 100` ఫేమ్ కార్తికేయ హీరోగా దిగంగన సూర్యవన్సి హీరోయిన్‌గా నటించిన చిత్రం `హిప్పీ`. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను సమర్పణలో వీ క్రియేషన్స్ పతాకం పైన టీఎన్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం జూన్ 6న సినిమా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తికేయ మాట్లాడుతూ... జూలై 12, 2018.. నేను మళ్లీ పుట్టినరోజు. నాకు పునర్జన్మ దక్కినరోజు. ఆరోజు `ఆర్.ఎక్స్ 100` విడుదలైంది. ఈ సినిమా లేకపోతే నేను లేను.
కాబట్టి ఎన్ని సినిమాలు చేసినా నా తొలి సినిమా గురించి తప్పకుండా మాట్లాడుతాను. నేను పుట్టి 11 నెలలు అయ్యింది. నా పుట్టుకను అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
నన్ను మోటివేట్ చేస్తూ, భరోసా ఇచ్చారు. అందరి ఆశీర్వాదాలతో ఓ చిన్నబాబులా `హిప్పీ`తో తొలి అడుగు వేయబోతున్నాను. ప్రతి తల్లిదండ్రులకు వాళ్ల కన్నబిడ్డలు ఎంతగానో సంతోషపెడతారు. ఏదో సాధిస్తారని గట్టిగా నమ్ముతారు. ఇంత ప్రేమను చూపిస్తున్న మీకు .. హిప్పీ సినిమాతో నా కొడుకు అవుతున్నాడ్రా అనిపిస్తాను. ఫస్ట్ స్టెప్‌తో ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. హీరో అయితే చాలు. నా సినిమాను కొంత మంది చూస్తే చాలు అనుకునేవాడిని.
హీరో కావాలని చిన్నప్పట్నుంచి కలలు కన్నాను. అసలు హీరోలు ఎలా ఉంటారబ్బా? వారికి బాత్‌రూమ్‌లు వస్తాయా? అనిపించేది. కానీ సడెన్‌గా నన్ను హీరో అంటుంటే మామూలు మనిషినే. నేను ఇంత కష్టపడితే ఎంతో ఇచ్చారు. మీ ప్రేమను చూశాను. అందుకనే ఇకపై ముందుకే వెళతాను. కానీ వెనక్కి వెళ్లలేను. అలా వెళ్లకూడదనే `హిప్పీ` సినిమా సెలక్ట్ చేసుకున్నాను. ఒళ్లు దగ్గర పెట్టుని పనిచేస్తాను. మీ ప్రేమ తర్వాతే ఏదైనా. దాని ముందు ఎంతైనా కష్టపడొచ్చు. మీ ప్రేమను వదులుకోలేను. హిప్పీతో సక్సెస్ కొడుతున్నాం. హిప్పీ సినిమా విషయంలో నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి కారణం డైరెక్టర్ కృష్ణగారే.
నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు. కృష్ణగారు నాలో ఏం చూశారో నాకు తెలియదు. నాతో ఫైట్స్ చేయించాడు, డ్యాన్సుల చేయించాడు. ఆర్.ఎక్స్ 100 తర్వాత నేను లవ్ ఫెయిల్యూర్‌కి నేను బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను. ప్రతి దానికి నేను సింబల్ అయిపోయాను. కానీ నేను మీరు కోరుకునే స్థాయికి వెళ్లాలంటే డిఫరెంట్ సినిమాలు చేయాలి.
ఆర్.ఎక్స్ 100లో అమ్మాయి వదిలేసిందని ఏడ్చిన నేను.. ఇక్కడ ఇద్దరమ్మాయిలతో తిరుగుతూ ఫిలాసఫీ చెబుతున్నాను. ప్రతి అబ్బాయి అమ్మాయితో ఉన్నప్పుడే మరో అమ్మాయిని చూడాలనుకుంటాడు. ప్రతి ఒక్కరిలోనూ ఈ ఎమోషన్ ఉంటుంది. ప్రతి సీన్‌లో మీరు, మీ స్నేహితులు కనపడతారు. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు.