బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (06:55 IST)

'శాతకర్ణి'.. ఓ చారిత్రక 'అబద్ధం'... అవాస్తవాలతో సినిమా... చరిత్రకారుల విమర్శలు

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించి, సంక్రాంతికి విడుదలైన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి... కలెక్షన్లపరంగా దూసుకెళుతోంది. అదేసమయంలో ఈ చిత్రంపై విమర్శలు కూడ

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించి, సంక్రాంతికి విడుదలైన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి... కలెక్షన్లపరంగా దూసుకెళుతోంది. అదేసమయంలో ఈ చిత్రంపై విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. శాతకర్ణి చారిత్రక అబద్దమని, అవాస్తవాలు, కల్పిత కథతో చిత్రాన్ని తెరకెక్కించారంటూ కొందరు సీనియర్ చరిత్రకారులు ఆరోపిస్తున్నారు.
 
ఇదే అంశంపై వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు కెప్టెన్‌ ఎల్‌ పాండురంగారెడ్డి, హైదరాబాద్‌ డక్కెన్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ప్రతినిధి డీపీ రెడ్డిలు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... గౌతమిపుత్రుని చరిత్ర గురించి కొత్త తరానికి అవాస్తవాలు చెప్పారని మండిపడుతున్నారు. 
 
'శాతకర్ణి' అసలు కోటి లింగాలలో పుట్టనేలేదని, ఆయన తల్లి బాలాశ్రీ వేయించిన శాసనాల్లో ఈ విషయం లేదన్నది వాళ్ళ వాదన. కేవలం దక్కన్ పీఠభూమిని మాత్రమే పాలించిన శాతకర్ణి, దేశమంతటినీ పాలించినట్టు ఎలా చూపెడతారని నిలదీస్తున్నారు. శాతకర్ణి తెలంగాణ వ్యక్తి కాదని వారు వాదిస్తున్నారు.