గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (21:59 IST)

ఇలా చిరంజీవి కూర్చున్న స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ వుంటే ఎలా వుండేది!

Bholashankar location
Bholashankar location
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళా శంకర్‌ చిత్రం కొల్‌కొత్తా బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. ఇది వేదాళం రీమేక్‌ అని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా చక్కటి హిల్‌ లొకేషన్‌లో ఇలా చిరంజీవి, తమన్నా, దర్శకుడు మెహర్ రమేష్, టెక్నీషియన్స్‌ షూటింగ్‌ గ్యాప్‌లో ఇలా వున్నారు. ఈ ఫొటోను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అయితే ఈ సినిమా అసలు ముందుగా పవన్‌ కళ్యాణ్‌కు వెళ్ళింది. కానీ ఆయన కమిట్‌మెంట్‌ వున్న సినిమాలతోపాటు రాజకీయాలతో బిజీగా వుండడంతో సాధ్యపడలేదు. అందుకే తిరిగి చిరంజీవి దగ్గరకు వచ్చింది.

ఈ విషయాన్ని దర్శకుడు మెహర్‌ రమేష్‌ తెలియజేస్తూ.. నా ఆరాధ్య దైవం, అభిమానితో నేను సినిమా చేస్తానని ఊహించలేదు. నా డ్రీమ్‌ నెరవేరింది అని అన్నారు.
 
ఇక సినిమాలో ఏదైనా పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడుకోవాలని చిరంజీవి ఇచ్చిన సూచన మేరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిగించేవిధంగా పవన్‌ మేనరిజాన్ని చిరంజీవి యాక్షన్‌ సీన్‌లోనూ, ఓ పాటలోనూ వుండేలా చూసుకున్నారు. భోళాశంకర్‌లో ఇదే ప్రత్యేకత. ఫైనల్‌గా ఏది ఎవరికి రాసి పెట్టివుందో అదే జరుగుతుంది. నా విషయంలోనూ అలా చిరంజీవిగారితో భోళాశంకర్‌ సినిమా వచ్చిందని దర్శకుడు మెహర్ రమేష్, చాలా సంబరపడిపోయాడు.