శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (12:22 IST)

కృష్ణుడిగా కనిపించబోతున్న హృతిక్ రోషన్.. ద్రౌపదిగా దీపికా పదుకునే?

ధూమ్-క్రిష్-వార్ ఇలా ఎన్నో యాక్షన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన హృతిక్ ఇప్పుడు కృష్ణుడి పాత్ర కోసం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంటుంది. అలాగే  ద్రౌపతి పాత్రకు ఇప్పటికే స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.
 
కానీ అమీర్ ఖాన్ మహాభారతం లాంటి ప్రాజెక్టులో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పాడు. ముఖ్యంగా కృష్ణుడి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన అమీర్ భవిష్యత్తులో తప్పకుండా అలాంటి సినిమాల్లో నటిస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ హీరో కంటే ముందే హృతిక్ కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
 
అయితే  మధు మంతెన ఇటీవల ఇచ్చిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ మహాభారతం అభిమానులను ఆకర్షించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే దీపావళికి మొదటి పార్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ ప్రాజెక్ట్ లో కృష్ణుడి పాత్రలో యాక్షన్ హీరో హృతిక్ రోషన్ కనిపించబోతున్నట్లు సమాచారం.