ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:29 IST)

కేటీఆర్‌కు ప్ర‌భాస్ స‌పోర్ట్.. దీని వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటి..?

డైన‌మిక్ లీడ‌ర్ కేటీఆర్‌కు... యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌పోర్ట్ చేశారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే ప్ర‌భాస్ కేటీఆర్‌కు స‌పోర్ట్ చేయ‌డం ఏంటి? అనుకుంటున్నారా..? కానీ... ఇది నిజంగా నిజం. మేట‌ర్ ఏంటంటే... ప్ర‌స్తుతం తెలంగాణ‌లో దోమ‌ల కార‌ణంగా డెంగ్యూ, వైరల్ జ్వ‌రాలు ఎక్కువ అవుతున్నాయి. 
 
ఈ క్ర‌మంలో తెలంగాణ పుర‌పాల‌క మంత్రి కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. "మీ ఇంటి ప‌రిస‌రాల్లో నీటి నిల్వ‌లు లేకుండా ఎయిర్ కూల‌ర్ల‌లో, నీటి కుండీల్లో, పూల కుండీల్లో నీటి నిల్వ‌లు లేకుండా చూసుకోవాలి.
 
 నేను నా ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించి నీటిని తొల‌గించాం. దోమ‌ల వ్యాప్తికి ఇదే కార‌ణం. వైర‌ల్‌, డెంగ్యూ జ్వ‌రాలు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి. మీరు కూడా నీటి నిల్వ‌లు లేకుండా చూసుకుని ఆ పనికి సంబంధించిన ఫొటోల‌ను నాతో పంచుకోండి" అంటూ ట్వీట్ చేశారు. 
 
ఆయ‌న కొన్ని ఫొటోల‌ను షేర్ చేశారు. ఈ మంచి ప‌నికి ప్ర‌భాస్ త‌న వంతు మ‌ద్దతుని ఫేస్‌బుక్ ద్వారా తెలియ‌జేశారు. ఇంటి ప‌రిస‌రాల్లో నీటి నిల్వ‌లు లేకుండా ఉన్న ఫొటోల‌ను ప్ర‌భాస్ షేర్ చేశారు.

ఈ విష‌యాన్ని అంద‌రికీ చేరేలా చూడండి. ఆరోగ్యంగా ఉండండి అని ప్ర‌భాస్ తెలిపారు. ప్ర‌భాస్ యాక్ష‌న్‌కు కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. అది మేట‌రు.