బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (13:40 IST)

పోలీసులకు చిక్కిన టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్

తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన హైదరాబాద్ నగర పోలీసులకు చిక్కారు. దీంతో ఆయనకు 700 రూపాయల అపరాధం విధించారు. ఇంతకు ఈయనకు పోలీసులు ఎందుకు అపరాధం విధించారో పరిశీలిద్ధాం. 
 
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కార్లకు బ్లాక్ ఫిల్మ్, వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు ఉంటే వాటిని పోలీసులు తొలగించి జరిమానా విధిస్తున్నారు. 
 
అయితే, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన కారుకు బ్లాక్ ఫిల్మ్ వాడి పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మీదుగా వెళుతున్న సమయంలో ఆయన కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దాన్ని తొలగించి, జరిమానా విధించారు. 
 
అంతేకాకుండా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులతోపాటు హీరోలతో పాటు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, కళ్యాణ్ రామ్ కార్లకు కూడా బ్లాక్ ఫిల్మ్ తొలగించి అపరాధం విధించిన విషయం తెల్సిందే.