అఖిరా వాయిస్‌కు నేను ఫ్యాన్‌ను త్వరలో తెలుగులో ఎంట్రీ
పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన కుమారుడు అఖిరా నందన్‌ను గురించి కొన్ని విశేషాలు తెలియజేసింది. అఖిరా తెలుగు మాటలు పట్టి పట్టి మాట్లాడుతుంటాడు. అవి వినడానికి చాలా ముద్దుగా వుంటాయి. నేను అఖిరా వాయిస్‌కు బిగ్ ఫ్యాన్ అంటూ రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా గత కొంతకాలంగా అఖిరాను సినిమాల్లోకి తీసుకురావాలనేది తన కోరికగా వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తరచూ తన సోషల్ మీడియాలో అభిమానులతో ఇతర విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు ప్రస్తావన వచ్చేది. తాజాగా ఆమె తన సోషల్‌మీడియాలో అభిమానులతో ఇట్రాక్ట్ అయింది.
రేణుదేశాయ్ నటి మాత్రమే కాదు. మరాఠీలో దర్శకురాలు, ఎడిటర్, నిర్మాత కూడా. సినిమారంగంలో కొన్ని శాఖలలో పట్టువుంది. కనుక అఖిరా నందన్‌ను ముందుగా తెలుగు తెరకే పరిచయం చేస్తానని అభిమానులతో షేర్ చేసుకుంది. ఎప్పుడూ అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం కరోనా విజృంభిస్తుంది. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొందరు ప్రాణాలు పోతాయేమోనని భయపడుతున్నారు. ప్రతివారూ జాగ్రత్తగా వుండాలి. ఇలాంటి పరిస్థితులలో అఖిరాను పరిచయం చేయడం సరైందికాదు. కరోనా సద్దుమణిగాక తప్పకుండా అఖిరా మీ ముందుకు వస్తారు. మీరంతా ఆశీర్వించాలని అని పేర్కొంది. దీనికి వారంతా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవలే రేణుదేశాయ్ కరోనా పేషెంట్లను ఆదుకుంటానని సోషల్‌మీడియాలో పేర్కొని తనవంతు సాయంగా చేస్తానని ప్రకటించింది కూడా.