శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (16:59 IST)

మీకు దణ్ణం పెడతారా బాబూ... నేను గర్భవతిని కాదు : చిన్మయి

టాలీవుడ్ సింగ్ చిన్మయి నెటిజన్స్‌కు చేతులెత్తి జోడిస్తూ ఓ విజ్ఞప్తి చేశారు. తాను గర్భవతిని కాదు బాబోయ్ అంటూ ప్రాధేయపడ్డారు. తాను గర్భవతిని అంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో చిన్మయి చీరకట్టులో ఉంది. అయితే ఆమె చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబీ బంప్‌తో ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆమె గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. 
 
ఈ ప్రచారంపై చిన్మయి స్పందించారు. తాను గర్భవతి అనే వార్తలను ఆమె ఖండించారు. తాను గర్భవతిని కాదని చెప్పారు. తాను మడిసార్ ధరించానని... ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయిందని అన్నారు. అయినా తన పర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.
 
ఒకవేళ నేను గర్భవతిని అయినా ఆ విషయాన్ని మీతో పంచుకోవచ్చు లేదా పంచుకోకపోవచ్చు అని చిన్మయి అన్నారు. తమ పిల్లల ఫొటోలను వంద శాతం తాము సోషల్ మీడియాలో పంచుకోబోమని తెలిపింది. తనపై వస్తున్న గర్భందాల్చినట్టు సాగుతున్న ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని ఆమె ప్రాధేయపడ్డారు. 
 
కాగా, చిన్మయి ఓ నేపథ్య గాయనిగానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై గళమెత్తి పలువురు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. మీటూ ఉద్యమంలో దక్షిణాదిన ఎక్కువగా పోరాడారు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ రైటర్‌గా ఉన్న వైరముత్తుకు చుక్కలు చూపించారు.