శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (18:58 IST)

మహాసముద్రం ఐకానిక్ సినిమాల లిస్టులో చేరిపోతుందని నమ్ముతున్నా - హీరో సిద్దార్థ్.

Siddharth. Ajay Bhupathi, Aditirao Haideri, Sunkara Ramabraham
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడింది.
 
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ‘మహా సముద్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఉప్పెన వచ్చే ముందుండే ప్రశాంతతలా ఇంకొన్ని గంటలు మేం అలా ఉంటాం. మహా సముద్రం ఫస్ట్ వేవ్ (ఫస్ట్ ట్రైలర్) చూశారు. సెకండ్ వేవ్ చూశారు. ఇక రేపు చూడబోయేది ఉప్పెన అని అనుకుంటున్నాం. రిలీజ్ ప్రెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ మీద ముందు అజయ్ భూపతికి కాన్ఫిడెన్స్‌ ఉండేది. ఇప్పుడు మా అందరికీ ఉంది. రేపు విడుదలైన తరువాత అది మీకే తెలుస్తుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు. ఓవర్సీస్‌లో భారీ ఎత్తున విడుదలవుతోంది. కోవిడ్ తరువాత అత్యంత భారీ ఎత్తున విడుదలవుతున్న చిత్రాల్లో ఇది కూడా ఒకటి. పండుగ ఉండటం వల్ల ఒక రోజు మాకు కలసి వస్తుంది. అందుకే గురువారం వస్తున్నాం. శుక్రవారం రెండు సినిమాలు రాబోతోన్నాయి. అవి కూడా బాగా ఆడాలి. దూకుడు చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా  కూడా దసరాకు వచ్చింది. ఇప్పుడు మహాసముద్రం కూడా దసరాకు వస్తుంది.’ ఈ సినిమా విజయం పై పూర్తి నమ్మకంతో ఉన్నాం అన్నారు.
 
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘నాకు ఇది చాలా ముఖ్యమైన రోజు, ఎన్నో రోజుల నుంచి  ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. రేపు నా చిత్రం విడుదల కాబోతోంది. ఆర్ ఎక్స్ 100 సినిమా రిలీజ్ అయిన క్షణం నుంచి ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూశాను. షూటింగ్‌లో అయితే ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురూచూశాను. అది ఈ రోజు వచ్చింది. ట్రెండ్ సెట్టింగ్ ట్రైలర్ వదిలావ్ అని అందరూ ప్రశంసించారు. అందరూ అద్భుతంగా ఉందని అంటే.. దీనికి మించిన ట్రైలర్ వదులుతాను అని చెప్పాను. అయితే అందరూ వద్దని చెప్పారు. ఆ ట్రైలర్ అద్భుతంగా ఉంది. మళ్లీ వచ్చేది అంతకంటే గొప్పగా ఉండాలి. అది చాలా కష్టమవుతుంది. వద్దు అని అన్నారు. కానీ నాకు మాత్రం నా సినిమా మీద నమ్మకం ఉంది. ట్రైలర్ కట్ చేసిన తరువాత నిర్మాతకు పంపాను. ఆయనకు నచ్చింది. వెంటనే రిలీజ్ చేద్దామని అన్నారు. నాకు నా స్టోరీ మీదున్న కాన్ఫిడెన్సే ఆ పని చేయించింది.  కొన్ని కొన్ని స్టోరీలకు హీరోలని వెతుకుకోవాల్సిన పని లేదు. కథే వారిని వెతుక్కుంటుందని అంటుంటారు. నా అదృష్టం కొద్దీ ఈ సినిమా శర్వా దగ్గర, సిద్దార్థ్ దగ్గర, అనిల్ దగ్గర వచ్చి ఆగిపోయి నా చేతిలో పడింది. గత వారం రోజులుగా ఎంత ఆనందంగా ఉన్నానో మీరే చూసి ఉంటారు. ఎన్ని రోజులు ఆగామన్నది కాదు ఫైనల్ గా కొట్టామా లేదా అన్నది ముఖ్యం. సిద్దార్థ్ లుక్ పరంగా ఆయనదే క్రెడిట్. ఈ క్యారెక్టర్ తనకు కొత్తగా ఉంటుందని ఇన్వాల్వ్ అయ్యి ఈ క్యారెక్టర్ చేశారు. ఈ స్టోరీ మొత్తం రన్ కావడానికి చాలా క్యారెక్టర్స్ హెల్ప్ చేశాయి.  సిద్దుకి, శర్వకి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్లిద్దరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. మీరు బయటకు వచ్చే సరికి అందరూ మీకు గుర్తుంటారు. ఒక్కటి మాత్రం చెబుతున్నా ఈ స్టోరీ, క్యారెక్టరైజేషన్స్ వచ్చే జనరేషన్స్ ఒక కొలమానంగా తీసుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ కి స్టార్ట్ ఉంది ఎండ్ ఉంది. అన్ని కథల్లో అది కుదరదు. ఈ సినిమాలో మహా క్యారెక్టర్ బరువున్న క్యారెక్టర్. అందుకే అనుభవమున్న హీరోయిన్ కావాలి. ఫస్ట్ సిట్టింగ్ లో అదితి ఓకే చెప్పింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చెబుతున్నా ఈ సినిమా బడ్జెట్ కూడా నాకు తెలియదు. నిర్మాత నుంచి నాకెలాంటి ప్రెజర్ లేదు. ఇదే నాకు పెద్ద గిఫ్ట్. మన ఫ్రెండ్ చెడ్డోడు అయినా మంచోడు అయినా చివరి వరకు వదలొద్దు అనేది మెయిన్ కథ. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ బ్లాక్ బస్టర్ అయినప్పుడు సినిమా ఎందుకు కాదండి. మా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను చాలా నమ్మకంగా ఉన్నాను. మహా సముద్రం హిట్. మళ్లీ రేపు సాయంత్రం కలుద్దాం. మీరంతా (మీడియా) రేపు వచ్చేందుకు రెడీగా ఉండండి.’ అని అన్నారు.
 
 
అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ.. ‘రేపు మా అందరికీ ఎంతో ముఖ్యమైన రోజు. మహాసముద్రం టీంతో పని చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఫీమేట్ సెంట్రిక్‌గా రాసిన కథలో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. అమ్మాయిలు తమ ఎమోషన్స్ చూపించేందుకు సిగ్గుపడరు. వారికున్న ఎమోషన్స్‌ను చూపించేస్తారు. అలాంటి పాత్రలు రాయడంలో అజయ్ భూపతి ఎంతో సున్నితమనస్కులు. ఆయన మహా పాత్రను ఎంతో గొప్పగా రాశారు. ఎంతో గొప్పగా తెరకెక్కించారు. సెట్‌లో ప్రతీ రోజూ ఎంజాయ్ చేశాను. నా కెరీర్‌లో ఈ పాత్ర ఎంతో స్పెషల్. నాకు ఇలాంటి పాత్ర రావడం ఎంతో అదృష్టం ఇంత మంచి పాత్రను రాసినందుకు, నాకు ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్. మా టీంకు బ్లాక్ బస్టర్ సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ప్రేమ మాకు లభిస్తుందని ఆశిస్తున్నాం. రేపు థియేటర్లో కలుద్దామ’ని అన్నారు.
 
సిద్దార్థ్ మాట్లాడుతూ, మాహా సముద్రంలో 'మహా' నా పక్కనే ఉంది. ఆ సముద్రానికి గర్వం ఇచ్చే ఒక పాత్ర 'అర్జున్' అనే పాత్ర. అందులో ప్రాణం పోసింది నా మిత్రుడు శర్వానంద్. గత కొన్ని వారాలుగా ఈ సినిమాను మేమే నిర్మిస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక బిడ్డలా ఈ సినిమాపై మాకు ప్రేమ కలిగింది. ఆ ప్రేమ అనేది ఒక లోతైన ఎమోషన్. శర్వా ఇక్కడకు రాకపోవడంతో ఎంతో మిస్ అవుతోన్నట్టు అనిపిస్తోంది. శర్వాకు ఫీవర్ ఉండటంతో రాలేకపోయాడు. మాహా సముద్రం ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఎన్ని ఇబ్బందులు పడిందో మీ అందరికీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని అనిల్ గారు భారీ బడ్జెట్ కేటాయించారు. ఒక విపత్కరమైన సమయంలో ఈ సినిమాను కంప్లీట్ చేయడం చాలా గర్విస్తున్నాం. టీం మొత్తం ప్రత్యేకంగా అనిల్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. అజయ్ కూడా మేకింగ్ పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకొని రూపొందించారు. ఇమేజ్ అనే పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. నాకు కొత్త ఇమేజ్ అజయ్ భూపతి క్రియేట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో ప్రతి రోజు నాపై నమ్మకం చూపించాడు, ఇది నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ 2 సెకండ్స్ నుంచి సిద్దార్థ్ ని కాకుండా విజయ్ అనే ఒక క్యారెక్టర్ ని చూస్తారని చెప్పగలను. ఈ క్యారెక్టర్ నాకొక లైఫ్ టైం క్యారెక్టర్ అవుతుందని నమ్ముతున్నా. యాక్టింగ్ అనేది ప్రతి శుక్రవారం ఓ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి మార్కులు ఇస్తారో చూద్దాం. నేను ఒక స్క్రిప్ట్ వింటున్నప్పుడు అందులో ఎంతమంది స్టార్స్ ఉంటారని ఎప్పుడూ చూడలేదు. అజయ్ భూపతి నాకు కథ చెప్పాడు. ఈ రెండు క్యారెక్టర్‌లలో ఏది అని అడిగా. విజయ్ అని చెప్పారు ఓకే అన్నా. ఈ సినిమా విషయానికొస్తే శర్వనే చాలా బరువు మోశారు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు తెలుగు సినిమా. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా. ఈ సినిమాతో శర్వా దగ్గర చాలా నేర్చుకున్నా. ఈ సినిమా ఒక ఐకానిక్ సినిమా లిస్టులో చేరిపోతుంది అని నమ్ముతున్నా. ఈ రోజు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అని పెట్టాం. థియేటర్స్ కి మా సినిమా వస్తోందని గర్వంగా చెబుతున్నాం. థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. థియేటర్స్ ఓపెన్ అయ్యాక రీసెంట్ గా లవ్ స్టోరీకి ఘన విజయం అందించారు. ఇంకా ఇండియా మొత్తంలో చాలా చోట్ల థియేటర్స్ ఓపెన్ కాలేదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నా. మమ్మల్ని మీరు బాగా చూసుకోండి. మాస్కులు ధరించి జాగ్రత్త పడండి. మీ ఎంటర్ టైన్ మెంట్ మేము చూసుకుంటాం. ఈ సినిమా మాకు బిడ్డ లాంటిది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అన్నారు.