గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 జులై 2022 (11:09 IST)

ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలమంటే నేను న‌మ్మ‌ను - ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్‌

N.T.R. Jr
N.T.R. Jr
తెలుగు సినిమా రంగం ఇప్పుడు గ‌డ్డుకాలంలో వుంది. థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డంలేద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌య‌మై ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలం న‌డుస్తోంది. థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డంలేద‌ని అంటున్నారు. అది  నేను న‌మ్మ‌ను. అద్భుత‌మైన చిత్రం వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ప్రేక్ష‌కులే దేవుళ్ళు.
 
ప్రేక్ష‌కులు అభిమానులు థియేట‌ర్ల‌లో సినిమా చూసి తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త ఊపిరి ఇవ్వండి. నా త‌మ్ముడు సినిమా బింబిసార విడుద‌ల‌వుతుంది. అలాగే రాబోయే సీతారామం కూడా విడుల‌వుతుంది. వాటిని కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఎన్టీఆర్ రాక‌తో క‌ళ్యాణ్ రామ్ బింబిసార చిత్రానికి కొత్త ఉత్సాహం వ‌చ్చింది.