సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (11:53 IST)

'భరత్ అనే నేను'లోని "ఐ డోంట్ నో" ఫుల్ వీడియో సాంగ్

ప్రిన్స్ మహేష్ బాబు, హీరోయిన్ కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం గత నెల 20వ తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.

ప్రిన్స్ మహేష్ బాబు, హీరోయిన్ కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం గత నెల 20వ తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఇక మే 25న త‌మిళ‌నాట 'భ‌ర‌త్ ఎన్రుం నాన్' పేరుతో విడుద‌ల కానుంది. ఇక కేర‌ళ‌లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌ల‌యాళంలో డ‌బ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 25న భ‌రత్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ కానుంది.
 
అయితే కొద్ది సేప‌టి క్రితం 'ఐ డోంట్ నో' అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు. బాలీవుడ్ న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఈ పాట‌ పాడ‌గా, దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. 'భ‌ర‌త్ అనే నేను' చిత్రంలో శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో క‌నిపించారు. ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా 'భరత్ అనే నేను' రూపొందింది. ఇందులో మహేష్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.