శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (10:33 IST)

సినిమాలు చేయడం నాకు నచ్చదుః నాగార్జున

Nagarjuna still
ఏసీపీ విజయ వర్మ పాత్ర నచ్చడంతోనే వైల్డ్ డాగ్‌కు ఓకే చెప్పాను. ఆయన మంచి టీం లీడర్, మంచి భర్త, మంచి తండ్రి. ఆయన ప్రేమించిన దానికి ఏం చేసేందుకైనా రెడీగా ఉంటారు. ఆయన భారతదేశాన్ని ప్రేమించారు. దాని కోసం ఏమైనా చేస్తారు. కొత్తదనం కోసం పాకులాడుతూ ఉంటారు.. దేనీ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అనుకుంటారు.. నాకు కూడా అలానే ఉంటుంది`` అని నాగార్జున అన్నారు. 
 
నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా న‌టిస్తోన్న ఈ మూవీలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాత‌లు. ఈ ఏప్రిల్‌ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సంద‌ర్భంగా `వైల్డ్‌డాగ్ బేస్ క్యాంప్` పేరుతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్‌. 
 
ఇంకా నాగార్జున‌ మాట్లాడుతూ, కొత్త సినిమాలు, కొత్త దర్శకులు, కొత్త బ్లడ్, కొత్త ఎనర్జీ కోసం ప్రయత్నిస్తుంటాను. యంగ్ వాళ్లతో పని చేస్తుంటాను కాబట్టే ఇలా నేను యంగ్‌గా ఉంటాను. మూసధోరణి పాత్రలు, సినిమాలు చేయడం నాకు నచ్చదు. నాకు బోర్ కొట్టిన పనులు, సినిమాలు మళ్లీ చేయను. నేను పోషించిన పాత్రల్లో ఇది చాలా బలమైన క్యారెక్టర్. ఈ పాత్ర కోసం రాసిన డైలాగ్‌లు నా గుండెల్లోనే ఉంటాయి. నేను వైల్డ్ డాగ్ కాదు. నిర్మాత నిరంజన్ రెడ్డి అసలు వైల్డ్ డాగ్. క్షణం, ఘాజీ లాంటి కొత్త కొత్త సినిమాలను తీస్తుంటారు. నిరంజన్ రెడ్డి గారు ఈ కథను తీసుకొచ్చారు కాబట్టే ఈ చిత్రాన్ని చేశాను. సోలోమన్ మైండ్‌లో అన్నీ ఉంటాయి. ఆయనకు ఏం కావాలో అన్నీ తెలుసు అని తెలిపారు.