ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (17:17 IST)

కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పట్ల చింతిస్తున్నా : ఊర్మిళ

కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధంపై చింతిస్తున్నట్టు బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ చెప్పారు. ఇటీవలే శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో తనకున్న కొద్దిపాటి అనుబంధం పట్ల చింతిస్తున్నానని పేర్కొన్నారు. 
 
ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు చేసే రాజకీయనేతగా ఉండటం తనకు ఇష్టం లేదని స్పష్టంచేశారు. తాను ప్రజల అభిమానంతోనే సినీ నటిగా ఎదిగానని, ఆ కోవలోనే ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నానని వివరించారు. 
 
అందుకే శివసేన పార్టీలోకి వచ్చానని వెల్లడించారు. కులం, మతం పట్టించుకోనని, ప్రజల కోసమే పనిచేస్తానని ఊర్మిళ చెప్పుకొచ్చారు. ఊర్మిళ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 
 
అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీకి ఎడంగా ఉంటున్నారు. శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినా ఊర్మిళ తిరస్కరించారు.