గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (13:49 IST)

నా అసిస్టెంట్లపై ఉగ్రరూపం చూపిస్తా: నరేశ్‌

Allari naresh
Allari naresh
సరదాగా సెటైర్లతో వుండే అల్లరి నరేశ్‌ తన క్యారెక్టర్‌కు తగినట్లే సినిమాలు చేస్తూ వున్నాడు. ఆయనలోని నటుడిని చూసి ఆయన తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణగారు హీరోగా చేసి బెండు అప్పారావు, కితకితలు పలు సినిమాలు చేసి సక్సెస్‌ సాధించాడు. ఇదే విషయాన్ని నరేష్‌ చెబుతూ, నాన్నగారున్నప్పుడు అన్నీ సక్సెస్‌ సినిమాలు చేశాను. ఆ తర్వాత రొటీన్‌ సినిమాలు కావడంతో భిన్నమైన సినిమా చేయాలని ప్రయత్నించా. అది నాంది సినిమాకు సెట్‌ అయింది. అదే టీమ్‌తో ఇప్పుడు ఉగ్రం చేశా. మరో సినిమా కూడా ఆటీమ్‌తో చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.
 
అయితే, లల్లరి నరేశ్‌లో ఉగ్రుడు వున్నారని ఎలా అనుకున్నారని వెబ్ దునియా  విలేకరి అడిగిన ప్రశ్నకు సంభాషణల రచయిత కథకుడు అబ్బూరిరవి చెబుతూ, నాందిలో ఆయనలో ఉగ్రుడు వున్నాడని రుజువైంది అని సమాధానం చెప్పాడు. ఆ వెంటనే నరేశ్‌ మాట్లాడుతూ, నా గురించి తెలియాలంటే నా అసిస్టెంట్లను అడగండి. నేను ఎంత ఉగ్రంగా వుంటానో చెబుతారంటూ.. నాలో మరో కోణం కూడా వుందని క్లారిటీ ఇచ్చాడు. మరి ఆయన అసిస్టెంట్లను అడిగితే ఇంకెన్ని కోణాలు చెబుతారో మరి.