నాకు లవ్ బ్రేకప్ అయింది - నన్ను యాక్టింగ్ వద్దన్నారు- శియా గౌతమ్
శియా గౌతమ్ అసలు పేరు అతిధి గౌతమ్. ఈమె రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో 2008లో వచ్చి నేనింతే చిత్రంలో నటించింది. జూనియర్ ఆర్టిస్టు పాత్రలో నటించి వారి సాధకబాధలు ఎలా వుంటాయో ఆమె పాత్రలో చూపించాడు దర్శకుడు. ఆ సినిమా తర్వాత మరలా చిన్నచిన్న చిత్రాలు చేసింది. వేదం సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఏడు ప్రేమకథలు అనే సినిమాలోనూ నటించింది. అయితే ఏదీ ఆమెకు క్రేజీ తీసుకురాలేదు. ఈమధ్యలో ఓ బిజినెస్‌మేన్‌తో లవ్‌లో పడింది. అది కూడా బ్రేకప్ అయిందని తెలియజేసింది శియా.
బ్రేకప్ అనేది సహజమే. అందరికీ జరిగినట్లే నాకూ జరిగింది. అసలు నాకు హెయిర్ హోస్టెస్ కావాలని వుండేది. అది నెరవేరలేదు. హీరోయిన్‌గా మారాలనుకున్నాను. కానీ కెరీర్ ఎందుకో మందకొడిగా సాగుతోందని ఆమె మనసులోని మాటను తెలియజేసింది. తాజాగా ఆమె గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది. ఈమె పాత్ర సర్‌ప్రైజ్‌గా చిత్ర యూనిట్ వుంచింది. అయితే బ్రేకప్ తర్వాత టఫ్ టైంలో స్నేహితులు, సన్నిహితులు ఓ సలహా ఇచ్చారట. యాక్టింగ్ చేయవద్దని. వెయిట్ కూడా లాస్ అవుతావు ఎందుకు? అలా వుంటే బాగోవు అని అన్నారట. ఈ విషయాన్ని శియా చెబుతూ, పక్కా కమర్షియల్ సినిమాలో సగం ఎపిసోడ్స్‌లో లావుగా కనిపిస్తాను. మిగిలిన నగంలో వెయిట్ లాస్‌లో కనిపిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇలా రెండు రకాలుగా కనిపించడం ఒకే సినిమాలో విశేషమేమరి.