బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (21:59 IST)

నా సినిమాకు ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలనుకోలేదు: సాయిధరమ్ తేజ్

తిరుపతిలోని పిజిఆర్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి కూర్చుని సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను వీక్షించారు హీరో సాయిధరమ్ తేజ్. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి వచ్చిన సాయిధరమ్ తేజ్ అభిమానులతో స్వయంగా మాట్లాడారు. అరగంటకు పైగా సినిమా చూశారు సాయిధరమ్ తేజ్. 
 
కరోనా తరువాత తన సినిమా థియేటర్లలో విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. యువతకు మెసేజ్ ఇస్తూ వచ్చిన చిత్రం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోందన్నారు సాయిధరమ్ తేజ్.