శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 జనవరి 2016 (16:02 IST)

నేను రోజూ రెండు పొగాకు చుట్టలు కాలుస్తా... ఫ్యాన్స్ మీరు కాల్చకండి... బాలయ్య పిలుపు

పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం... ఇది నినాదం. ఐతే ఈ నినాదం సిగరెట్ పెట్టెపై ఉంటుంది. కానీ ఆ పెట్టెపై ఉన్న స్లోగన్ చూస్తూనే పెట్టెడు సిగరెట్టు ఉఫ్ అంటూ ఊదేస్తుంటారు చాలామంది పొగరాయుళ్లు. ఆ సంగతి సరే... డిక్టేటర్ చిత్రం భలే సక్సెస్ ఇచ్చిందంటూ చెప్పుకుంటున్న బాలయ్య ఈరోజు ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. 
 
తన స్వరం బాగుండటం కోసం తన తండ్రి ఎన్టీఆర్ ప్రతిరోజూ రెండు పొగాకు చుట్టలు తాగేవారని చెప్పారు. తన తండ్రి అలవాటే తనకి కూడా వచ్చిందనీ, ఆయన కాల్చినట్లే తను కూడా రోజుకు రెండు చుట్టలు కాలుస్తానని చెప్పారు. ఐతే ఆ వెంటనే... అభిమానులు మాత్రం పొగాకుకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు ఉత్పత్తులతో చేసే సిగరెట్, చుట్టలు తాగవద్దని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... తన తండ్రి ఎన్టీఆర్ తనపై ఏరోజూ చేయి చేసుకోలేదనీ, అలాగే అన్నయ్య హరికృష్ణపైన కూడా అంతేనంటూ చెప్పుకొచ్చారు.