గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (14:22 IST)

హిమాలయాలకు వెళ్దామనుకున్నా : హీరో విశ్వక్ సేన్

Vishwak Sen
Vishwak Sen
ఈ మధ్య జరిగిన అలజడికి వారం రోజులు హిమాలయాలకు వెళ్దామని అనుకున్నా. కానీ రోనక్ కు మాటిచ్చా కాబట్టి ఇక్కడికి వచ్చాను. సాయి రోనక్ నాలాగే పక్కా హైదరాబాద్ కుర్రాడు. కొన్ని సినిమాల  ఆడిషన్స్ దగ్గర మేము కలిసే వాళ్లం. రోనక్ ఎదగాలని కోరుకునే స్నేహితుడిని నేను. టీజర్ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఇంప్రెసివ్ గా ఉన్నారు. పాటలు బాగున్నాయి. టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నా- అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. 
 
రాజయోగం  టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ, నేను చెప్పిన ఏ సూచననూ అర్జున్ గారు పట్టించుకోలేదు. ఆ సినిమా కథ గురించి మరోసారి డిస్కస్ చేద్దామనే ఆ రోజు షూటింగ్ వద్దని చెప్పాను. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి మళ్లీ మొదటి మెట్టుకు దిగజారొద్దనే ఈ జాగ్రత్తలు అంతే గానీ అర్జున్ గారిని అగౌరపరచాలని కాదు. అర్జున్  గారిని ఇబ్బడి పెడితే సారీ మెబుతున్నాను.  ఆయనకు ఆయన మూవీకి బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.