సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (19:41 IST)

పవన్‌ను చూసి ఆ విషయం నేర్చుకున్నా: రామ్ గోపాల్ వర్మ కితాబు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి పవన్ స్పీచ్‌ను అదుర్స్ అన్నాడు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ గొప్ప నాయకుల్లో ఒక వ్యక్తిగా నిలిచిపోతారని తాను భ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి పవన్ స్పీచ్‌ను అదుర్స్ అన్నాడు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ గొప్ప నాయకుల్లో ఒక వ్యక్తిగా నిలిచిపోతారని తాను భావిస్తున్నట్లు కొనియాడాడు. అయినా వర్మ కామెంట్స్‌పై నెటిజన్లు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్ వర్మను కొనియాడాడా? లేకుంటే పొగుడుతున్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇంతకీ వర్మ ఏమన్నారంటే..? పవన్ కల్యాణ్ ఏపీ పర్యటనలో భాగంగా చేసిన ప్రసంగం బాగుందన్నాడు. విభిన్నాంశాలపై ఆయనకు వున్న దూరదృష్టిని చూసి ఆశ్చర్యపోయాయనని వర్మ ఫేస్ బుక్‌లో ప్రశంసల జల్లు కురిపించారు. అంతేగాకుండా తాను పవన్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.

గతం, భవిష్యత్‌పై పవన్‌కి ఉన్న క్లారిటీ భేష్ అన్నారు. తనపై వచ్చిన పలు వదంతులకు పవన్ అద్భుతంగా వివరణ ఇచ్చారని చెప్పారు. వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ తన ఆలోచనలను.. భావాలను ఎలాంటి సంకోచం లేకుండా పవన్ వ్యక్తం చేశారని వర్మ కితాబిచ్చాడు.

ముఖ్యంగా మాట్లాడేముందు పవన్ ఆలోచిస్తాడు. ఈ విషయాన్ని పవన్ నుంచి తాను నేర్చుకున్నానని వర్మ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే తనకో స్టుపిడ్ హ్యాబిట్ వుందని.. మాట్లాడేటప్పుడైనా, ట్వీట్ చేసేటప్పుడైనా ఎటువంటి ఆలోచనా చేయకుండా.. అప్రయత్నంగానే చేసేస్తాను.

అందుకే దూరదృష్టితో మాట్లాడే పవన్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని వర్మ కామెంట్ చేశారు. గొప్ప నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కల్యాణ్ నిలిచిపోతారని తాను భావిస్తున్నానని వర్మ పేర్కొన్నారు.