శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (18:06 IST)

నన్ను చీట్ చేశారు.. ఆ సినిమాకు ఐదు లక్షలే ఇచ్చారు!: అవికా గోర్

చిన్నారి పెళ్లికూతురుతో బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన సినిమా చూపిస్తా మావ ఫేమ్ అవికా గోర్‌ను చీట్ చేశారట. ఎవరో తెలుసా..? నిర్మాతలేనట. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిన్నారి పెళ్లికూతురుతో ఫేమస్ అయిన అవికా గోర్‌కు డిమాండ్ పెరిగింది. తన తొలి సినిమా ఉయ్యాల జంపాల సినిమాకు చాలా తక్కువ పారితోషికం ఇచ్చారంటోంది. 
 
తొలి సినిమా కోసం తానూ రూ.5 లక్షలకే ఒప్పుకున్నానని.. మళ్లీ అదే తప్పును రిపీట్ చేయకుండా లక్ష్మీ రావే మా ఇంటికి,  సినిమా చూపిస్తా మావ సినిమాలకు బాక్సాఫీసు వద్ద హిట్ కావడంతో తొలి సినిమా పారితోషికానికంటే ఐదింతలు ఎక్కువ తీసుకున్నానని చెప్పింది. కాగా అవికా గోర్ తొలి సినిమా ఉయ్యాల జంపాలతు నాగార్జున నిర్మాత. విరించి వర్మ దర్శకుడు. మరి నాగార్జునే అవికాను చీట్ చేశాడా?