గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జులై 2022 (11:41 IST)

స్వామీ నిత్యానందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. ప్రియా ఆనంద్

Nithyananda
Nithyananda
హీరోయిన్ ప్రియా ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను వివాదాస్పద స్వామీ నిత్యానందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. 
 
స్వామి నిత్యానంద గురించి అందరికి తెలిసిందే. భారదేశంలో ఆశ్రమం నడిపి ప‌లు కేసుల్లో చిక్కుకోవడంతో దేశం విడిచిపోయాడు. ప్రస్తుతం ఎక్కడో ఓ దీవిని కొనుక్కొని కైలాస దీవి అని పేరు పెట్టుకొని అక్కడే ఉంటున్నట్టు ఆయనే తెలిపాడు. అక్క‌డ నుంచే సోష‌ల్ మీడియా ద్వారా త‌న భ‌క్తుల‌కు ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే తాజాగా ఈ స్వామీజీని పెళ్లి చేసుకోవాలి అని ప్రియా ఆనంద్ తెలిపింది. 
 
తెలుగులో లీడర్ సినిమాతో పరిచయం అయిన ప్రియా ఆనంద్ ఆ తర్వాత రామరామ కృష్ణకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాలతో మెప్పించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా తెలుగులో సుశాంత్ సరసన మా నీళ్ల ట్యాంకర్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సిరీస్ త్వరలో జీ5 ఓటీటీలో టెలికాస్ట్ కానుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యూనిట్.
 
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ప్రియా ఆనంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియా ఆనంద్‌ని ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడగగా ఆమె మాట్లాడుతూ.. "నేను నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. ఆయ‌న గురించి ఎలాంటి ప్ర‌చారం జరుగుతున్నా వేలాది మంది భ‌క్తులు ఆయ‌న్ని ఆరాధిస్తున్నారు. ఆయ‌న్ని పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు" అని తెలిపింది. 
 
అయితే ఇది సరదాగానే అన్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రియా ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.