నాకు ఇగోనే - మాలో ఏ ఒక్కరికీ సపోర్ట్ చేయనుః సిద్దార్థ్
నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో జీవితకాలపు సభ్యుడినే. ఎప్పటినుంచో తెలుగులో సభ్యత్వం తీసుకున్నా. నేను తెలుగువాడిని అని ముంబై ప్రెస్‌మీట్‌లో అంటే అక్కడవారు విమర్శించారు. ఆ మాట పట్టుకుని చెన్నైలో తమిళులు నామీద మరిన్ని విమర్శలు చేశారు. నేను నిజం మాట్లాడతాను. నాకు తెలుగు ప్రేక్షకులు లైఫ్ ఇచ్చారు. అందుకే అలా మాట్లాడాను. కొందరికీ ఇగో అనిపిస్తుంది. ఇలా వుండడం నాకు మా అమ్మనేర్పింది. ప్రేక్షకులు నాకిచ్చిన ప్రేమ అటువంటిది. అందుకు చిన్నతనం నుంచి వున్నది వున్నట్లు మాట్లాడతాను- అని సిద్ధార్థ్ తెలిపారు.
`మా` ఎన్నికల సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అనే దానికి ఆయన బదులిస్తూ, నేను మా సభ్యుడినే. ఈనెల 10న ఓటు వేస్తాను. అన్నీ ఫాలో అవుతున్నాను. `మా`లో కానీ బయట పాలిటిక్స్‌లోకానీ ఏ ఒక్కరినీ సపోర్ట్ చేయను. అందరినీ తిడతాను. ఓటు అనేది హక్కు. నా బుర్రలో ఏది వుందో వారికే ఆ టైంలో ఓటు వేస్తాను అని సిద్దార్థ్ స్పష్టం చేశారు.
రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ, నేను నిజం ఎక్కువ మాట్లాడతాను. అందుకే పాలిటిక్స్‌కు నేను పనికిరాను. కానీ ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేనని ట్విస్ట్ ఇచ్చాడు. దటీజ్ సిద్దార్థ్.