బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 మే 2024 (17:56 IST)

పవన్‌కల్యాణ్‌కు మద్దతు ప్రకటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

allu arjun X letter
allu arjun X letter
జనసేన అధ్యక్షుడు, జనాసేనాని  పవన్‌కల్యాణ్‌ మీద తన అభిమానాన్ని, ప్రేమను మరోసారి చాటుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌.  '' మీరు ఎంచుకున్న నిస్వార్థమైన మీదారిని.. ప్రజల సేవలకు మీ జీవితాన్ని అంకితం చేసిన విధానం చూసి నేను ఎప్పూడు గర్వపడుతుంటాను. మీ  కుటుంబ సభ్యుడిగా, నా ప్రేమ, మద్దతు మీతో ఎప్పుడూ వుంటాయి. 
 
మీ రాజకీయ ప్రస్థానంలో మీరు కోరుకున్నవి అన్నీ సాకారం కావాలని, మీ రాజకీయ ప్రయాణం విజయకేతనం ఎగురవేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'  అంటూ తన సోషల్‌ మీడియా వేదికగా జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్‌.

ఇప్పటికే పలువురు సినిమా తారలుకూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించి ప్రచారం చేశారు. మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేశారు. జబర్ దస్త్ టీమ్ కూడా ప్రచారం చేస్తూనే వుంది. ఈరోజు అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు.