గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (17:16 IST)

మరో నలుగురు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తే పండగే : డింపుల్ హయతి

Dimple Hayati
Dimple Hayati
పరిశ్రమలో తెలుగు అమ్మాయిగా రెండో సినిమాగా రామబాణం చేస్తున్నాను. పరిస్థితులు మారాయి. సినిమా మారింది. శ్రీలీల తెలుగమ్మాయి. మరో నలుగురు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా వచ్చినపుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది అని నటి డింపుల్ హయతి అన్నారు. 
 
గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
 
రామబాణం ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
రామబాణం ‘కిలాడీ’ సినిమా చేస్తున్నపుడే సైన్ చేశాను. కిలాడీలో చాలా గ్లామరస్ గా కనిపించాను. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు శ్రీవాస్ గారు ఎందుకో భైరవిలా అనిపించడం లేదనే సంకోచం వ్యక్తం చేశారు. రెండుసార్లు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఇందులో భైరవి పాత్రకు సరిపోతాననే నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు.
 
 మీ నిజ జీవితానికి, ఈ పాత్రకు డిఫరెన్స్ ఏమిటి ?
ఇందులో అర్బన్ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర పేరు భైరవి. తను వ్లాగర్. నిజ జీవితంలో అయితే నేను సోషల్ మీడియాకి దూరంగా వుంటాను. కాబట్టి ఈ పాత్ర నాకు కొత్తగానే అనిపించింది.  రీల్స్, వ్లాగ్స్ చేయడంలో ఫన్  జనరేట్ అయ్యింది. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ లు వున్నారు. వారందరితో కలసి వ్లాగ్ చేయాలి, ఇది చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. రామబాణం అందరినీ అలరించే ఎంటర్ టైనర్.
 
గోపీచంద్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
గోపీచంద్ గారు చాలా తక్కువగా మాట్లాడతారు. పొద్దున్న హాయ్ అంటే సాయంత్రం బాయ్.. దట్సాల్. నేను కూడా తక్కువగానే మాట్లాడతాను. ఆయన చాలా ఫోకస్డ్ గా వుంటారు. సీన్ సరిగ్గా రాకపోతే ఆయన కళ్ళలోనే అర్ధమైపోతుంది. చాలా కంపోజ్డ్ గా మాట్లాడతారు. గోపీచంద్ గారు జెంటిల్ మెన్. చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
 
డ్యాన్సర్  యాక్టర్ అయితే ఎలాంటి అడ్వాంటేజ్ వుంటుంది ? మీ వరకూ డ్యాన్స్ నటనకి ఎలా కలిసొచ్చిందని భావిస్తున్నారు ?
నన్ను చాలా మంది యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళారా ? అని అడుగుతారు. నేను ఎప్పుడూ యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళలేదు. ఇంట్లోనే చాలా మంది డ్యాన్సర్లు, యాక్టర్స్ వున్నారు. ఇంటి నుంచే ఎక్కువ క్రిటిసిజం వుంటుంది. (నవ్వుతూ). నటన కూడా డ్యాన్స్ నుంచే వచ్చింది.
 
క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారా?
ప్రత్యేకంగా అరంగేట్రం అంటూ ఏమీ చేయలేదు. ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాను. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఫ్లో లోనే వచ్చింది. కూచిపూడిలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఒకప్పుడు ప్రతిఏడాది వేలాది మంది డ్యాన్సర్లతో సిలికానాంధ్ర ప్రోగ్రాం నిర్వహించేది. అందులో నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది.
 
మీ కుటుంబ నేపధ్యం ఏమిటి ?
మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. చాలా మంది నటులు, డ్యాన్సర్లు వున్నారు. నాన్న బిజినెస్ మాన్. నాన్న తమిళ్. అమ్మ తెలుగు. బెజవాడలో పుట్టాను. హైదరాబాద్ లో పెరిగాను.
 
 ఏలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు.
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. నటిగా గద్దల కొండ గణేష్ సాంగ్ , ఇందులో ఐఫోన్ సాంగ్ ఒకటే. నటిగా సరిగ్గా చేశానో లేదో చూసుకుంటాను. అని రకాల పాత్రలు చేయాలని వుంది.