శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (20:27 IST)

నా ముందు అమలాపాల్ దిగదుడుపే : న్యూడ్ నటనపై బిందుమాధవి

ఇటీవలి కాలంలో అనేక మంది హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో నటించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. నయనతా, ప్రియమణి, త్రిష, జ్యోతిక, సమంత, అంజలి ఇలా అనేక మంది నటీమణులు ఆ హీరోయిన్ తరహా పాత్రల్లో నటిస్తూ, ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా అమలా పాల్ "ఆడై" చిత్రంలో నగ్నంగా నటించి, ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో అమలాపాల్ నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. 
 
దీనిపై మరో నటి బిందు మాధవి స్పందించింది. 'ఆడై' చిత్రంలో అమలా పాల్ నటించినదానికంటే మరింత రెట్టింపుతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బిందుమాధవి ప్రకటించారు. కాగా, వరుస విజయాలతో కోలీవుడ్‌లో నటిగా రాణిస్తున్న బిందుమాధవి 'బిగ్‌బాస్‌-1' గేమ్‌షోలో కూడా పాల్గొని అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బిందుమాధవి కృష్ణ హీరోగా నటించిన 'కళుగు-2'లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథకు ప్రాముఖ్యత వుంటే అమలాపాల్‌లా తాను నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.