ఆదివారం, 24 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (17:03 IST)

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

Rakesh Varre, Rambabu Goshala, Virinchi Verma, Ravinder Reddy
Rakesh Varre, Rambabu Goshala, Virinchi Verma, Ravinder Reddy
రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇటీవలే జరిగింది.
 
హీరో రాకేష్ మాట్లాడుతూ, "ఎవరికీ చెప్పొద్దూ సినిమా తర్వాత, చేస్తే మంచి సినిమా చేయాలి కానీ మాములు కంటెంట్ తో సినిమా చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. లేట్ అయినా కానీ మంచి సినిమా చేయాలనే నేను డిసైడ్ అయ్యాను. మార్కెట్ కానీ బ్రాండ్ కానీ లేకపోతే ఏ హీరో ని పట్టించుకోరు. రాకేష్ అనే నేను ఒక బ్రాండ్ గా ఎదిగిన రోజున నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను.

జితేందర్ రెడ్డి సినిమా నేను చేయడానికి కారణం ఈ సినిమా కథ. ఈ సినిమా పూర్తిగా చేసాం కానీ మే లో రిలీజ్ అనుకున్నాం. వేరే వేరే ఇష్యుస్ వల్ల సినిమా పోస్టుపోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడేం బాన్ చేస్తాం అంటున్నారు. కనీసం సినిమా చూసింది అందులో ఏం ఉందొ కూడా చూడకుండా అలా మాట్లాడుతున్నారు. జితేందర్ రెడ్డి గారు ఒక ఫైటర్. అయన అభిమానులు ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమా కి 75 రూపీస్ తో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం" అని అయన అన్నారు.
 
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, "ఈ సినిమా ని డైరెక్ట్ చేయడం నేను లక్కీ గా ఫీల్ అవుతున్నాను. జితేందర్ రెడ్డి గారి కథ విన్నాక, నేను ఈ సినిమా చేయాలనే డిసైడ్ అయ్యాను. ఈ సినిమా కి చాలా పెద్ద స్పాన్ ఉంది. ఈ సినిమా కి సరైన నటీనటులు, టెక్నీషియన్స్ మరియు నిర్మాత అందరూ దొరికారు. ఈ సినిమా నిర్మాత వారి సోదరుడి కథ చెపుదాం అని ముందుకొచ్చారు. ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేసారు. రాకేష్ నటించడమే కాకుండా నిర్మాణం లో కూడా హెల్ప్ చేసాడు. మీడియా వాళ్ళు కూడా మా సినిమా కి అందించిన సపోర్ట్ కి థాంక్స్. మంచి సినిమా తో మీ ముందుకు వస్తున్నాం అని ప్రగాఢంగా నమ్ముతున్నాం." అన్నారు.
 
గేయ రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ, "ఈ సినిమా లో అన్ని పాటలు రాసాను. ఇంతకు ముందు అర్జున్ రెడ్డి కి కంతారా కి రాసాను. వాటితో పోలిస్తే ఈ సినిమా పాటలు డిఫరెంట్ గా ఉంటాయి. నిన్న రిలీజ్ అయినా ఈ మట్టి బంగారం అనే సాంగ్ నా బెస్ట్ వర్క్ అనుకుంటాను. మజ్ను, ఉయ్యాలా జంపాల రాసాను, డైరెక్టర్ విరించి వర్మ గారు ఈ సినిమా లో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. హీరో రాకేష్ గారు బాగా కష్టపడ్డారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను" అన్నారు.
 
నిర్మాత రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, "మీడియా వాళ్లందరికీ నమస్కారం. ఈ పాటికే ఈ సినిమా ఏంటి అని అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. నేనే తక్కువ సినిమాలు చూసే వాణ్ణి కానీ నేను ఈ సినిమా తీశాను. ఈ సినిమా ట్రావెల్ లో అందరితో పని చేయడం మర్చిపోలేని అనుభవం. ఈ సినిమా తీశానని తృప్తి నాకు ఉంది. నేను ఏదైతే చెప్పాలని అనుకున్నానో దాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. జితేందర్ రెడ్డి జీవితం ఒక చరిత్ర. కానీ ఆ కథ ని చాలా బాగా చూపించారు. జగిత్యాల లో ప్రీమియర్ వేసాము. చూసిన వాళ్ళు చాలా మంది కళ్లనీళ్లు పెట్టుకున్నారు." అన్నారు.
 
రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.