Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోటి రూపాయలిచ్చినా ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించను... పోసాని

మంగళవారం, 4 జులై 2017 (20:05 IST)

Widgets Magazine
posani krishna murali

రాంగోపాల్ వర్మ స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తారన్న దగ్గర్నుంచి అటు అభిమానులు, ఇటు సెలబ్రిటీలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి బయోపిక్ తీయడం వేస్ట్ అన్నారు. ఎన్టీఆర్ ఎవరెస్ట్ శిఖరం అనీ, అలాంటి ఆయనలో మచ్చలు చూపించే ప్రయత్నం చేస్తే ఆయన అభిమానులు, ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చిరంచారు. అంతేకాకుండా అసలు ఆ సబ్జెక్టును టచ్ చేయకపోవడమే బెటర్ అని సూచన చేశారు.
 
ఒకవేళ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తూ ఆ చిత్రంలో తనను నటించమని అడిగితే రోజుకి కోటి రూపాయలిచ్చినా అందులో చచ్చినా నటించనన్నారు. అసలు బయోపిక్ అంటే ఆయన జీవితమంతా తీయాలి. అవన్నీ తీసే సాహసం వర్మకు వుందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందు వరకూ తీసుకుంటే ఫర్వాలేదు కానీ ఆ తర్వాత తీస్తే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంటుందన్నారు. 
 
వెన్నుపోటు ఎవరు పొడిచారో చూపిస్తారా? హోటల్ వైస్రాయ్ వద్ద చెప్పులు ఎవరు వేశారో చెప్తారా? లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ప్రేమించి ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకున్నారో చెప్పగలరా? ఇవే కాదు ఇలాంటి ప్రశ్నలు చాలానే వున్నాయి. అందుకే ఎవరికైనా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనే ఆలోచనలుంటే మానుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యాంకర్ శ్రీముఖి ఫోటో... ఆడవారికి హెచ్చరిక అంటూ కటింగ్...

యాంకర్ శ్రీముఖి పటాస్ ఏ లెవల్లో పేలుతూ పోతుందో తెలిసిందే. ఇకపోతే శ్రీముఖి తను ఏ దుస్తులు ...

news

గట్స్ వున్న హీరోయిన్... గుండు కొట్టించుకుంది... ఎందుకో తెలుసా?

హీరోలు, హీరోయిన్లు గుండు కొట్టించుకోవడం అంటే అది పెద్ద న్యూస్ అవుతుంది. దేవుడి మొక్కులను ...

news

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్.. 70రోజులు, 12మంది సెలెబ్రిటీలు.. 60 కెమెరాలు

తమిళంలో సినీ లెజెండ్ కమల్ హాసన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ...

news

ఆ భయంతోనే దేశం వదిలి వెళ్ళిపోయా.. రవితేజ అంటే ఇష్టం: ఇలియానా

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన ఇలియానా.. ప్రస్తుతం బిటౌన్‌లో మకాం ...

Widgets Magazine