శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (10:21 IST)

ఐఫా 2016 : ఉత్తమ నటిగా దీపికా పదుకొణే.. ఉత్తమ చిత్రంగా బజరంగీ భాయీజాన్

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల ఫంక్షన్లో బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రా, సో

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల ఫంక్షన్లో బాలీవుడ్ నటీనటులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, అమీషా పటేల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ''బజరంగీ భాయీజాన్‌'' అవార్డును సొంతం చేసుకోగా, ''బాజీరావు మస్తానీ'' చిత్రం పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. 
 
ఉత్తమ దర్శకుడిగా ''సంజయ్‌ లీలా బన్సాలీ'' ఐఫా పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ''రణ్‌వీర్‌సింగ్‌'' అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా ''దీపికా పదుకొణె'', ఉత్తమ కథా రచయితగా ''జుహి చతుర్వేది'', ఉత్తమ ప్లే బ్యాక్‌ ఫిమేల్ సింగర్‌‌గా ''మొనాలీ ఠాకూర్''‌, ప్లే బ్యాక్‌ మేల్ సింగర్‌గా ''పపాన్''‌, ఉమెన్‌ ఆప్‌ దయ ఇయర్‌గా ''ప్రియాంక చొప్రా'', బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును ''సుదీప్‌ ఛటర్జీ'', ఉత్తమ ఎడిటింగ్ ''శ్రీకర్‌ ప్రసాద్''‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డును ''ప్రసాద్‌ సుతారా'' సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ నటుల ఆటపాటలతో ఐఫా వేడుక ఉత్సాహంగా సాగింది.