గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:38 IST)

ఇక చాల్లే కృష్ణా రామా అనుకోండ‌ని రోజాను అన్న‌దెవ‌రు!

Roja's new house at nagari
న‌టి రోజా ఎం.ఎల్‌.ఎ.గా వున్నా ఇప్పుడు టీవీ షోల్లో దూసుకుపోతుంది. జ‌బ‌ర్ ద‌స్త్ ప్రోగ్రామ్‌లో అంతా ఆమెదే పైచేయి. ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్‌తోపాటు ఈమెకూడా చేసేస్తుంది. ఈమె ఇగోకు చాలామంది మ‌నసు చివిక్కుమ‌న్న సంద‌ర్భాలున్నాయి. కానీ ఎవ‌రూ పైకి మాట్లాడ‌లేదు. కానీ ఒకే ఒక్క‌డు ఆమెకు కౌంట‌ర్ వేస్తుంటాడు. అత‌న్ని కొడుకులా ట్రీట్ చేస్తున్నానంటూ చెబుతుండేది. అత‌నే హైప‌ర్ ఆది. త‌ను వేసే పంచ్‌ల‌కు ఆమె ఎదురు పంచ్‌లు వేయ‌డానికి ప్ర‌య‌త్నించినా తిరిగి పంచ్‌ల‌తో కొట్టేస్తాడు.
 
తాజాగా ఆమెకు ఆ అనుభ‌వం ఎదురైంది. త‌ను లేటెస్ట్‌గా న‌గ‌రిలో సొంత ఇల్లు నిర్మించుకుంది. అది పేలెస్ త‌ర‌హాలో వుంది. ఆ ఇంటికి ఆమె జ‌బ‌ర్‌ద‌స్త్‌లో కొంత‌మందిని ఆహ్వానించింది. ఈ సంద‌ర్భంగా ఆది ఇల్లు చూసి అదిరిపోయిందంటూ కామెంట్ చేశాడు. ఇంత సంపాదించారు. ఇంకా మీకు జీవితంలో తీర‌ని కోరిక వుందా? అని అడిగితే... కృష్న‌గారి అబ్బాయి మ‌హేష్‌బాబుతో న‌టించాల‌నుంద‌ని చెప్పింది. వెంట‌నే పంచ్ ల ఆది.. కృష్ణా రామా అనుకోకుండా ఇంకా క‌ష్ణ గారి అబ్బాయితో అంటారేంటి? అంటూ అన్నాడు. వెంట‌నే ఏమి అనాలో తెలీక‌.. న‌వ్వుతూ.. ఆదిని సున్నితంగా కొట్టింది. సో.. మ‌హేష్‌బాబు చూడాల‌నే ఆమె ఆదిచేత ఇలా చెప్పించ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.