తెల్లగా ఉన్నానని అతనితో డేటింగ్ చేస్తున్నానా? ఇలియానా

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (13:54 IST)

గోవా బ్యూటీ ఇలియానా నెటిజన్లపై ఫైర్ అయ్యింది. ఎక్కడికెళ్లినా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ గురించే అడుగుతున్నారని వాపోయింది. చాలామంది తన బాయ్‌ఫ్రెండ్ గురించి అడగటంలో తప్పులేదు కానీ.. అతని జాతి గురించి అడుగుతున్నారని మండిపడింది. అతను తెల్లగా వున్నందువల్లే అతనితో తాను డేటింగ్ చేస్తున్నానని ఫైర్ అయ్యింది. అదొక్కటే తనకు నచ్చలేదని ఇలియానా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో తనకు వస్తున్న కామెంట్లపై స్పందించింది. తాను పబ్లిక్ ఫిగర్‌ అని.. అయితే పబ్లిక్‌ ప్రాపర్టీని మాత్రం కానేకాదని చెప్పేసింది. మిగిలిని పురుషులంతా తమ భార్యలు, తల్లుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తున్నారా? అని ప్రశ్నించింది. మరి తన విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించలేనని ఇల్లీ బ్యూటీ స్పష్టం చేసింది. 
 
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఇలియానా బర్ఫీ (2012) సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. ఆపై మేన్ తెరా హీరో, రస్తూమ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. దీనిపై మరింత చదవండి :  
Stalkers Andrewkneebonephotography Public Property Public Figure Social Media Ileana D’cruz

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంతకు భర్తగా అర్జున్ రెడ్డి.. మరి షాలిని పాండే సంగతేంటి?

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. ...

news

మహేష్ అప్పుడు చబ్బీగా ఇప్పుడు స్టైలిష్‌గా, బాండ్‌లా ఉన్నాడు: రజనీకాంత్

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ ఆడియో వేడుక చెన్నైలోని కలైవానర్ అరంగం ప్రాంగణంలో ...

news

బుల్లితెరపై కనిపించనున్న రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. ...

news

పవన్ కల్యాణ్‌కు ''హాఫ్ నాలెడ్జ్'' అన్న మహేష్ కత్తి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్

సినీన‌టుడు, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై‌‍ సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి వివాదాస్పద ...