ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (22:07 IST)

సమంత బాటలో ఇలియానా.... వెబ్ సిరీస్‌కు సై

ileana
ఒకపుడు టాలీవుడ్‌ను ఊపేసిన నటి గోవా బ్యూటీ ఇలియాన్. సన్నజాజి నడుం సుందరిగా గుర్తింపు పొందిన ఇలియానాకు అభిమానుల్లో మంచి క్రేజ్ వుంది. పైగా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే వుంది. 
 
అయితే, తమిళం, తెలుగు సినిమాల్లోనే నటిస్తూ వస్తున్న ఇలియానా 2012 తర్వాత కేవలం హిందీ సినిమాల్లోనే నటిస్తున్నారు. ఆమె నటించిన రెండు హిందీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
 
ఇదిలావుంటే ఇలియానా వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించింది. వెబ్ సిరీస్‌లలో నటించిన సమంత ఇప్పుడు 'పాన్ ఇండియా స్టార్'గా మారుతోంది. ఆమె ఎదుగుదల చూసి ప్రముఖ నటీమణులు ఆశ్చర్యపోతున్నారు. 
 
సమంతలాగే ఇలియానా కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ మహిళా సెంట్రిక్ సిరీస్‌కు కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలియానా తర్వాత ప్రముఖ హిందీ నటీమణులు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.