శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (12:42 IST)

లైగర్ నటుడికి కోపం వచ్చింది.. అంతే అభిమానిని ఏం చేశాడంటే?

mike tyson
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అంటూ అభిమానులు ఎగబడడం సాధారణ విషయమే. అయితే ఒక్కోసారి అభిమానులు హద్దులు మీరు చేసే పనులు సెలబ్రిటీలను విసిగిస్తాయి. అలా ఓ అభిమాని లైగర్ నటుడిని విసిగించాడు. సహనం కోల్పోయిన లైగర్ నటుడు మైక్ టైసన్ అభిమానిపై చేజేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే… అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుండీ ఫ్లోరిడా వెళ్ళే విమానంలో మైక్‌టైసన్‌ ప్రయాణిస్తున్నాడు. ఆయన వెనుక సీట్లో కూర్చున్న ఓ కుర్రాడు టైసన్‌ను చూసి తెగ ఎగ్జయిట్‌ అయిపోయి టైసన్ తో ముచ్చటించాలని ట్రై చేసాడు. 
 
టైసన్‌ మొదట ఓ నవ్వు నవ్వుకుని సైలెంట్ అయిపోయాడు. అయినా ఆ కుర్రాడు టైసన్‌ను విసిగించాడు. దీంతో టైసన్ కు కోపం రావడంతో ఆ కుర్రాడి పై నాన్ స్టాప్ పంచులతో దాడి చేసాడు. ఇంకేముంది ఆ కుర్రాడి మొహానికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన ప్రస్తుతం వైరల్ అవుతుంది.