గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (14:08 IST)

చీరకట్టులో ఆకట్టుకున్న డింపుల్‌- ఖిలాడి- ఫస్ట్ సింగిల్ రిలీజ్‌

Dimple-Raviteja
రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి` షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
- ఇటీవ‌ల ర‌వితేజ‌, డింపుల్ హ‌య‌తి మీద తెర‌కెక్కించిన పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.
ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఇష్టం’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు.
 
ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకున్నారు. రవితేజ మీదున్న ప్రేమను డింపుల్ ప్రకటించేట్టుగా ఈ పాట కొనసాగుతుంది. తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అద‌ర‌గొట్టారు. తెరపై ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.
 
ఇక ఈ పాట‌కు  ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన మెలోడి ట్యూన్‌ను దేవీ శ్రీ  ప్రసాద్ ఇచ్చారు. శ్రీ మణి అద్భుతమైన సాహిత్యం అందించగా.. హరి ప్రియ గానం అందరినీ ఆకట్టుకుంటోంది. యశ్ మాస్టర్ ఈ పాటను అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు.
 
థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ కష్టపడుతున్నారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయ‌నున్నారు.
 
ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, అనసూయ.
 
సాంకేతిక బృందం
కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ, నిర్మాత: సత్యనారాయణ కోనేరు, బ్యానర్:  ఏ స్టూడియోస్, పెన్,  స్టూడియోస్, ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్,  సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద,  సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణు,  స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ,  ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు, డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్, ఎ డిటర్: అమర్ రెడ్డి