Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజనీ పాలిటిక్స్‌పై ఫైర్ అయిన కస్తూరి: తమిళనాడులో వేరే సమస్యలు లేవా? అంటూ ప్రశ్న

బుధవారం, 28 జూన్ 2017 (17:57 IST)

Widgets Magazine
kasthuri

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి కలిగించే ప్రకటన చేసినా.. క్లారిటీ లేకుండా రాజకీయాలపై రజనీకాంత్ వ్యవహరించడంపై ఆయన ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారా? రారా? అని జాతీయ మీడియా వేసిన ప్రశ్నకు.. సినీ నటి, రజనీ ఫ్యాన్స్ కస్తూరి ఫైర్ అయ్యారు. 
 
రజనీకాంత్ నాన్చుడు ధోరణిపై ఫైర్ అయిన కస్తూరి గతంలో.. రజనీతో సమావేశమైంది. దీంతో ఆమె కూడా రజనీకాంత్ పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలొచ్చాయి. దీనిపై తాజాగా ఆమెను మీడియా ప్రశ్నించింది. కానీ కస్తూరి మాత్రం రజనీ, రాజకీయాలు తప్ప తమిళనాడులో వేరే సమస్యలు లేవా అంటూ మీడియాను ఎదురుప్రశ్న వేసింది. రాష్ట్రంలో అంతకుమించిన సమస్యలు ఎన్నో వున్నాయనే విషయాన్ని గుర్తు చేసింది. దీంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.
 
ఇదిలా ఉంటే రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై జ్యోతిష్కులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులు, కుటుంబీకులు, స్నేహితులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను కూడా రజనీకాంత్ త్వరలో కలవనున్నారట. రాజకీయాల్లోకి రావచ్చొనా? లేకుంటే రాజకీయాలకు దూరంగా ఉండటం మేలా? అనే దానిపై బిగ్ బీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బేబీ బంప్‌తో బికినీలో సెలీనా జైట్లీ... ఆనందంలో ఇలా షేర్ చేసింది...

బాలీవుడ్ సినీ నటిగా పేరు తెచ్చుకున్న సెలీనా జైట్లీ మళ్లీ గర్భవతి అయ్యింది. తను ...

news

జవానుగా సెప్టెంబర్ 1న వస్తోన్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు బీవీఎస్ రవి ...

news

సినీ పరిశ్రమలో ఎవరి స్వార్థం వారిది.. ఉదయ్ కిరణ్ మృతికీ అదే కారణం: శివాజీ రాజా

సినీ పరిశ్రమ ఎవరూ బాధలో ఉన్నా పట్టించుకోదని.. ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని మూవీ ...

news

పూరీ ఇస్తానంటే చార్మీ వద్దంటుందా? రూ.4 కోట్లు చార్మికి అందుకే ఇచ్చాడట...

సెక్సీ హీరోయిన్ చార్మి సినిమాల్లో నటించకపోయినా దాదాపు ఆ స్థాయిలోనే సంపాదిస్తోందంటున్నారు ...

Widgets Magazine