శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 డిశెంబరు 2022 (17:54 IST)

సీజన్‌ 14: ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సింగింగ్‌ టాలెంట్‌ హంట్‌ ‘రేడియో సిటీ సూపర్‌ సింగర్‌’

image
భారతదేశంలో సుప్రసిద్ధ రేడియో నెట్‌వర్క్‌ రేడియో సిటీ తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ సీజన్‌ 14ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో అతిపెద్ద సింగింగ్‌ టాలెంట్‌ హంట్‌ ప్రారంభమై 2022 సంవత్సరానికి 14 సంవత్సరాలు అయింది. దశాబ్ద కాలంగా లక్షలాది మంది భారతీయుల అభిమానాన్ని చూరగొన్న రేడియో సిటీ సూపర్‌ సింగర్‌, దేశవ్యాప్తంగా ఔత్సాహిక గాయకులకు అందుబాటులో ఉన్న అతిపెద్ద వేదికలలో ఒకటిగా నిలిచింది. రేడియో పరిశ్రమలో సింగింగ్‌ టాలెంట్‌ హంట్‌ ద్వారా రేడియో సిటీ అత్యున్నత ప్రాచుర్యం పొందింది. ఈ సంవత్సరం కూడా తమ వారసత్వం కొనసాగిస్తూ ‘అగర్‌ హై మ్యూజిక్‌ సే ప్యార్‌, తో బనో సిటీ కే అగ్లే సింగింగ్‌ స్టార్‌’ ట్యాగ్‌లైన్‌తో పోటీ నిర్వహిస్తుంది.
 
వరుసగా మూడవ సంవత్సరం భారతదేశపు సోల్‌ఫుల్‌ మెస్ట్రో పద్మశ్రీ కైలాష్‌ ఖేర్‌ ఈ పోటీలకు మెంటార్‌గా వ్యవహరిస్తుండడంతో పాటుగా అత్యున్నత సింగర్స్‌ను కనుగొనడంలో తోడ్పడుతూనే ఈ షో ద్వారా స్టార్‌డమ్‌ పొందేందుకు సిద్ధం చేయనున్నారు. దేశవ్యాప్తంగా సింగింగ్‌ టాలెంట్‌ను సమర్పించడంలో విజయవంతంగా 13 సీజన్‌లను ముగించుకున్న తరువాత ఈ 14వ సీజన్‌ రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ ఇప్పుడు ప్రధానమైన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌తో పాటుగా ఆన్‌ ఎయిర్‌ మరియు ఆన్‌ గ్రౌండ్‌ యాక్టివేషన్స్‌తో సత్తా చాటనుంది. ఈ సీజన్‌ ఆడిషన్స్‌ డిసెంబర్‌ 6వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ షోలో పాల్గొనేందుకు 18సంవత్సరాల వయసు దాటిన యువతీయువకులు అర్హులు. ఓటింగ్‌ లైన్స్‌ డిసెంబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకూ జరుగుతాయి. రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ ఫైనల్స్‌ను డిసెంబర్‌ 21 నుంచి 23 వ తేదీ వరకూ జరుపనున్నారు. ప్రతి మార్కెట్‌లోనూ టాప్‌ 5 సింగర్స్‌ను ఎంపిక చేయడంతో పాటుగా ప్రతి మార్కెట్‌లోనూ  విజేతలతో పాటుగా రన్నరప్‌ను కూడా ప్రకటిస్తారు.
 
రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ సీజన్‌ 14 గురించి  రేడియో  సిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అషిత్‌ కుకైన్‌ మాట్లాడుతూ ‘‘రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ సీజన్‌ 14 ప్రారంభించామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా ఔత్సాహిక గాయకులకు ఓ వేదికను అందించాలనే మా నిబద్ధతను ఇది వెల్లడించనుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుని తమ అంతర్గత ప్రతిభను ప్రదర్శించాల్సిందిగా ఔత్సాహికులను స్వాగతిస్తున్నాము. రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ మా ప్రతిష్టాత్మకమైన ప్రోపర్టీ. గత 13 సీజన్‌లుగా ఎంతోమంది జీవితాలకు అదనపు విలువను ఇది జోడించింది. రేడియో పరిశ్రమలో సింగింగ్‌ టాలెంట్‌ హంట్‌ అగ్రగాములుగా మేము స్ధిరంగా మా ప్రేక్షకులకు అత్యద్భుతమైన  అవకాశాలను అందిస్తున్నాము.
 
ఈ సీజన్‌లో కూడా పద్మశ్రీ కైలాష్‌  ఖేర్‌ ఈ గాయకులకు మెంటారింగ్‌ చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మా ట్యాగ్‌లైన్‌ ‘అగర్‌ హై మ్యూజిక్‌ సే ప్యార్‌, తో బనావో సిటీ కే ఆగ్లే సింగింగ్‌ స్టార్‌’ గా నిర్ణయించాము. ఇది సంగీతం పట్ల మీ అభిరుచి ఈ నగరపు తరువాత సింగింగ్‌ సూపర్‌స్టార్‌గా మిమల్ని నిలుపుతుంది. ఈ ప్రయత్నంతో, రేడియో సిటీ సృజనాత్మక విధానాలను అనుసరించడం, విభిన్న సంస్కృతులను చేరుకోవడం ద్వారా నగరంలో అత్యున్నత ప్రతిభను వెలికితీసుకువచ్చే తమ వారసత్వం కొనసాగిస్తుంది’’ అని అన్నారు.
 
రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ మరో సీజన్‌లో భాగం కావడం పట్ల కైలాష్‌ ఖేర్‌ మాట్లాడుతూ, ‘‘నా సంగీత ప్రయాణంలో రేడియో సిటీ ఓ భాగం అయింది. రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ మరో సీజన్‌ ద్వారా ఔత్సాహిక గాయనీగాయకులకు మెంటార్‌ చేసే అవకాశం లభించడం పట్ల ఆసక్తిగా ఉన్నాను. దేశ వ్యాప్తంగా ఔత్సాహిక గాయకులను ఇది  వేడుక చేస్తుంది. సింగింగ్‌ ప్రతిభావంతులను గుర్తించేందుకు ఓ వేదికను అందిస్తున్న ఒకే ఒక్క రేడియో ప్లాట్‌ఫామ్‌గా రేడియో సిటీ నిలిచింది. వారి ప్రయత్నంలో భాగం కావడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. రేడియో సిటీ సూపర్‌ సింగర్‌ తో గత రెండు సీజన్‌లలో భాగం కావడంతో పాటుగా ఈ సీజన్‌లో కూడా భాగం అవుతున్నాను. ఈ ఆడిషన్‌ ద్వారా అత్యుత్తమ గానం చూడాలనుకుంటున్నాము’’ అని అన్నారు.