మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 మే 2022 (20:09 IST)

టిక్కెట్ల పెంపు అవ‌స‌ర‌మా లేదో పెద్ద‌లు చ‌ర్చించుకోవాలి - మంచు విష్ణు

Manchu Vishnu, Nageshwar Reddy
Manchu Vishnu, Nageshwar Reddy
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్య‌క్షుడు మంచు విష్ణు సినిమా టికెట్ల విష‌యంలో ఇంత‌కుముందు మాట్లాడ‌లేద‌ని అంద‌రూ విమ‌ర్శించారు. మాట్లాడ‌లేదంటే ఎందుక‌నో అర్థం చేసుకోవాల్సింద‌ని విమ‌ర్శ‌కులే అర్థం చేసుకోవాల‌ని మంచు విష్ణు అన్నారు. 'మా' ఆధ్వర్యంలో  AIG హాస్పిటల్ లో ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్ నిర్వ‌హించారు. గ‌చ్చిబౌలిలోని ఆసుప‌త్రిలో ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ,  ''మా సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వారు. మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు. మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము. మా‌ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. ప్రభుత్వ సహకారం ఉంది‌ కాబట్టి, ‌పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ డిబేట్ చేసుకొవాలి. మా సభ్యత్వం కు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము'' అని చెప్పారు.
 
సీనియర్ నటులు నరేష్ మాట్లాడుతూ - ''మంచు విష్ణు 'మా' ప్రెసిడెంట్ అయిన తరువాత ఫస్ట్ ప్రిపరెన్స్ హెల్త్ కి ఇవ్వడం సంతోషం గా వుంది. సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆరోగ్యం వుంటే అవకాశాలు వస్తాయి. AIG హాస్పిటల్ వారు 'మా' కు ఇస్తున్న సహకారం మరువలేనిది. AIG హాస్పిటల్ కి ఇంటర్ నేషనల్ లెవెల్ లో చికిత్స కోసం వస్తున్నారు. AIG హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మంచు విష్ణు అధ్వర్యంలో రెండో హెల్త్ క్యాంప్ జరుగుతోంది. ఇప్పుడు వున్న మా టీమ్ ఫర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారు'' అని తెలిపారు.