శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2016 (21:41 IST)

ఇండీవుడ్‌ కార్నివాల్‌ ప్రారంభం... ఇదే సరైన ప్రాంతం.. మంత్రి తలసాని

'మన సాంకేతిక మన సినిమా' అనే నినాదంతో 'ఇండీవుడ్‌ కార్నివాల్‌' రూపొందింది. ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సోహన్‌రాయ్‌ ఆధ్వర్యంలో 'ఇండీవుడ్‌ కార్నివాల్‌' పేరిట నాలుగురోజులపాటు హైదరాబాద్‌లో వేడుక జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడ

'మన సాంకేతిక మన సినిమా' అనే నినాదంతో 'ఇండీవుడ్‌ కార్నివాల్‌' రూపొందింది. ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సోహన్‌రాయ్‌ ఆధ్వర్యంలో 'ఇండీవుడ్‌ కార్నివాల్‌' పేరిట నాలుగురోజులపాటు హైదరాబాద్‌లో వేడుక జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ సరైన ప్రాంతమని.. అందుకు కృషి చేస్తున్నామని... తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు.
 
సినీరంగంలో సాంకేతికతను అభివృద్ధి చేయడం, దేశంలో వివిధ చిత్రపరిశ్రమలను ఒక తాటిపైకి తీసుకురావడం ఈ ఫెస్టివల్‌ ఉద్దేశం. ఈ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రారంభించాల్సిన కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రారంభించారు. వర్షాలవల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్థితులవల్ల ఆయన రాలేకపోయారనీ. ఆయన అండతోనే ఈ వేడుక జరుగుతుందని తలసాని వెల్లడించారు.
 
ఇంకా ఆయన తెలుపుతూ... బాలీవుడ్‌తో సమానంగా మన పరిశ్రమ విస్తృతి చెందుతుంది. దానికితగినట్లుగా తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సహకరిస్తుంది. త్వరలో సింగిల్‌విండో విధానం, రోజుకు ఐదు ప్రదర్శనలు ఆమోదించబోతున్నాం.  అంతర్జాతీయస్థాయిలో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌లో రెండు స్థలాలను పరిశీలించాం. ముఖ్యమంత్రి ఆదేశం ఇవ్వగానే కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఐదేళ్ళలో ఇండియన్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళాలనే సోహాన్‌ రాయ్‌ కృషి అభినందిస్తున్నానని' అన్నారు.
 
రామోజీరావు మాట్లాడుతూ... ఇండియన్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళేందుకు ఇదే సరైన వేదిక. అందుకు ఫిలింసిటీ వేదిక కావడం చాలా ఆనందంగా వుంది.  సాంకేతికంగా వివిధ రకాల మార్పులు తీసుకొచ్చేందుకు సోహాన్‌ కృషిచేస్తున్నారు. దానికి మనమంతా సపోర్ట్‌ చేయాలి. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వంతోపాటు మేమూ సహకరిస్తామని' పేర్కొన్నారు.
 
సోహాన్‌ రాయ్‌ తెలుపుతూ.. మొదటిసారి ఏర్పాటు చేసిన ఫెస్టివల్‌కు 43 దేశాల నుంచి సినిమాలు, ప్రతినిధులు హాజరుకాగా, ఈసారి చేస్తున్న వేడుకకు 80 దేశాలకు పెరిగింది. 132కిపైగా సినిమాలు, 2వేలమంది విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. అందుకే ప్రపంచస్థాయిలో ఇండియన్‌ సినిమాను మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా.. మన సినిమా పైస్థాయికి వెళ్ళాలన్నదే నా కోరిక. మీడియాకూడా సహకరిస్తే ఐదేళ్ళకు చేరాల్సిన గమ్యం మూడేళ్ళకే చేరుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సిని పరిశ్రమకు చేస్తున్న సేవలకుగాను ఎల్‌విప్రసాద్‌ కుమారుడు ప్రసాద్‌ల్యాబ్‌ అధినేత రమేష్‌ప్రసాద్‌కు లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు.