జీవితం ముగిసిపోనుంది... ఇక ఇవన్నీ ఎందుకు : బిగ్ బి

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (08:55 IST)

amitabh in sarkar

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితం ముగిసిపోయే క్షణంలో ఉందనీ, ఇపుడు ఇవన్నీ ఎందుకు? అని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
బాలీవుడ్ బిగ్ బి గురువారం తన 75వ పుట్టినరోజును ఎలాంటి హుంగూ ఆర్భాటం లేకుండా కేవలం తన కుటుంబసభ్యుల మధ్యే ఆయన గడిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు బిగ్ బీ వెళ్లి వచ్చారు. అమితాబ్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకపోవడంపై ఆయన అభిమానులు నిరాశ చెందారు. 
 
ఈ నేపథ్యంలో అమితాబ్ తన బ్లాగ్ ద్వారా చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. "75 ఏళ్ల తర్వాత అన్నింటికీ దూరంగా వెళ్లిపోతాం. ఈ వయసులో వేడుకలు జరుపుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎవరెవర్ని ఆహ్వానించాలి?.. ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతాయి. జీవితం ముగిసిపోయే క్షణంలో ఇవన్నీ ఎందుకు? నా వాళ్ల మధ్య కూర్చుని వాళ్లు చెప్పే సంగతులు వింటుంటే నన్ను నేనే కోల్పోతున్నాననే భయం కలుగుతోంది.." అని తన బ్లాగ్‌లో అమితాబ్ పేర్కొన్నారు. దీనిపై మరింత చదవండి :  
Maldives Mumbai Amitabh Bachchan Birthday Celebration

Loading comments ...

తెలుగు సినిమా

news

లక్ష్మీస్ ఎన్టీఆర్ పైన ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలు... వర్మ సెటైర్లు...

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో రాంగోపాల్ వర్మ ఓ రేంజిలో స్పందిస్తున్నారు. ఎట్టి ...

news

అలా జరిగి సర్వం కోల్పోయాను- మిల్కీ బ్యూటీ తమన్నా

చాలామంది హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదిస్తున్నా వారికి తీరని కోర్కెలు ...

news

శృతి హాసన్ మేకప్ తీసేస్తే జడుసుకుంటాం... చండాలం... అందగత్తెలిక్కడున్నారు...

డబ్బింగ్ చిత్రాలనే బ్యాన్ చేయగలిగిన కన్నడిగుల ఆత్మగౌరవం ఏమిటో స్టార్ జగ్గేష్ నిరూపించాడు. ...

news

నాగార్జునతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన కొత్త పెళ్లికూతురు సమంత.. (వీడియో)

టాలీవుడ్ అందాల తార సమంత పెళ్లికి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఓంకార్ ...