శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (14:40 IST)

జైపూర్‌లో శ్రీవల్లి చీరలు.. ఫోటోలు వైరల్

srivalli
srivalli
పుష్ప సినిమాలో పాటలన్నీ హిట్టే. ఈ సినిమాలోని సామి.. సామి పాట బాగా హిట్టేనన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మందన 'శ్రీవల్లి' (పుష్పలోని రష్మిక రోల్) స్ఫూర్తితో జైపూర్‌లోని దుకాణాలు ‘శ్రీవల్లి చీర’లను తయారు చేస్తున్నాయి.
 
పుష్పలో గోల్డెన్ గర్ల్ రష్మిక మందన్న నటనతో పాన్ ఇండియా స్టార్‌గా మారింది. సామి పాటలో అమ్మడు డ్యాన్స్ హైలైట్ అయ్యింది. దేశంలోని బట్టల హబ్‌గా ఉన్న రాజస్థాన్‌లోని దుకాణాల్లో ఈ చీర బాగా సేల్ అవుతోంది. 
 
ఈ చీర   'సామి సామి'లో రష్మిక ధరించిన డిజైన్‌లో కలిగివుంది. ఎరుపు రంగు చీర.. బంగారు బార్డర్‌తో వుంది. ప్రస్తుతం ఈ చీరకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక ప్రస్తుతం గుడ్‌బై, అనిమా, పుష్ప 2 వంటి ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది.