గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (13:15 IST)

చిన్మయి శ్రీపాద ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్.. ఎందుకంటే?

chinmayi sripada
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్ చేసింది. ఇందుకు కారణం ఏంటంటే... కొంత మంది నెటిజనులు ఆమె అకౌంట్‌ను రిపోర్ట్ చేయడమే. 
 
అబ్బాయిలు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌కు కంప్లయింట్ చేశానని గతంలో చిన్మయి తెలిపారు. అయితే... చాలా మంది అబ్బాయిలు ఆమె అకౌంట్‌ను రిపోర్ట్ చేయడం వల్ల ఇన్‌స్టా యాజమాన్యం డిలీట్ చేసినట్టు చిన్మయి చెప్పిన మాటలను బట్టి తెలుస్తోంది. 
 
''నాకు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేసిన మగవాళ్ళు రిపోర్ట్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్‌ నా అకౌంట్ డిలీట్ చేసింది'' అని ఆమె ట్వీట్ చేశారు. బ్యాకప్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ వివరాలు కూడా ఇచ్చారు.
 
కాగా  చిన్మయి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు... సోషల్ మీడియా వేదికగా మన సమాజంలో అమ్మాయిలు, మహిళలకు ఎదురవుతున్న పలు సమస్యల మీద గళం వినిపించే వనిత. అందువల్ల, తనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారని చిన్మయి కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు.