శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 14 జులై 2018 (19:01 IST)

మెగా ఫ్యాన్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న కొర‌టాల‌..!

బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ‌నున్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోస‌మే కొర‌టాల ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్

బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ‌నున్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోస‌మే కొర‌టాల ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించబోతున్నాడట. ఈ యేడాది నవంబర్ నెలలో ఈ చిత్రం ప్రారంభోత్స కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. 
 
సైరా నరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు కొర‌టాల‌తో చేయ‌నున్న సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట రాంచరణ్. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్స్‌లో కనువిందు చేయబోతున్నారని సమాచారం. రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐగా మరో పాత్ర ఉంటుందట. సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందని తెలిసింది. డ్యూయెల్ రోల్ అంటే మెగా ఫ్యాన్స్‌కి బంప‌ర్ ఆఫ‌రే. ఈ మూవీ పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు.