మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (17:35 IST)

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

Adhiti shankar
Adhiti shankar
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ సినిమాలో అల్లరి పిల్లగా వెన్నెల క్యారెక్టర్ లో అతిధి శంకర్ నటిస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె ఈమె. ఈమెకు సంబంధించిన పోస్టర్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై రూపొందిస్తున్నారు.
 
దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం' బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  
 
ఇటీవలే మనోజ్ మంచు గజపతి వర్మగా ఫెరోషియస్, రగ్గడ్  అవతార్‌లో కనిపించారు. ఇలా  ప్రతి రివీల్‌తో భైరవం చుట్టూ ఉన్న ఉత్సాహం పెరుగుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్,  నారా రోహిత్ లుక్ పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.