1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (08:47 IST)

యాంకర్ రష్మీ గౌతమ్‌కు నిజంగానే పెళ్లయిందా?

ప్రముఖ బుల్లితెర నటి, పాపులర్ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ గత కొన్ని రోజులుగా వార్తల ముఖ్యాంశాలలో ఉన్నారు. ఆమె పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల ప్రకారం యాంకర్ రష్మీ సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకున్నారని, ఈ వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజరుగా పని చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం. అయితే, ఈ వార్తలపై రష్మీ గౌతమ్ మాత్రం ఇప్పటివరకు నోరు మెదపలేదు. దీంతో రష్మీ గౌతమ్ నిజంగానే పెళ్లి చేసుకున్నారంటూ అనేక మంది నమ్ముతున్నారు. 
 
కాగా, గతంలో రష్మీ, బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నారని భావించారు, అయితే వారిద్దరూ పుకార్లను కొట్టివేసి, తాము మంచి స్నేహితులమని నొక్కి చెప్పారు. మరి ఈ పుకార్లపై నటి ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. వృత్తిరీత్యా "భోళా శంకర్" సినిమాలో చిరంజీవితో కలిసి రష్మీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.