శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 జులై 2019 (12:44 IST)

రామ్ షాకింగ్ ట్వీట్ - ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం...

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాన్ని పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో చిన్న పిల్ల‌లు చూసేందుకు అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌న్నివేశాలు ఉండ‌డం వ‌ల‌న సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. 
 
అయితే.. ఈ సినిమా గురించి రామ్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... పొగతాగడం, మద్యం సేవించడంతో పాటు 'ఇస్మార్ట్ శంకర్‌'లా నిజ జీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్ట్ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అనితెలుసుకుని ఇస్మార్ట్‌గా వ్యవహరించండి అని తెలిపాడు. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. రామ్ ఇస్మార్ట్‌గా ట్వీట్ చేసి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. మ‌రి..సినిమాతో ఇంకెంత ఆక‌ట్టుకుంటాడో చూడాలి.