గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (11:39 IST)

సూర్య‌లా కార్తీ స్టార్‌డ‌మ్ పొంద‌డం మామూలు విషయం కాదుః నాగార్జున

Nagarjuna, karthi, Rajisha Vijayan, Laila,
Nagarjuna, karthi, Rajisha Vijayan, Laila,
ఒకే కుటుంబంలో అన్న‌ద‌మ్ములు స్టార్ డ‌మ్ సంపాదించుకోవ‌డం మామూలు విష‌యంకాదు. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్, కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తి. ఇలా స్టార్ డమ్ సంపాయించడం మామూలు విషయం కాదు` అని నాగార్జున అన్నారు. కార్తీ న‌టించిన `సర్దార్` ప్రీరిలీజ్ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో ఆయ‌న మాట్లాడారు. ఈ వేడుకలో కార్తి చిత్రంలోని  'నేనే సేనాపతి' పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది.
 
నాగార్జున మాట్లాడుతూ.. కార్తితో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుండి కార్తితో అనుబంధం మొదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని ప్రజంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చేసినందుకు కార్తి గర్వపడుతున్నానని చెప్పారు.  కార్తి అన్న సూర్య సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి ప్రూవ్ చేసుకోవడం చాలా అరుదు. అలాంటి వాళ్ళని ఇద్దరినే చూశాను. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్..  కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తి. ఇలా స్టార్ డమ్ సంపాయించడం మామూలు విషయం కాదు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య అంత సూపర్ స్టార్ అయ్యారు. కార్తి తెలుగులో మాట్లాడటమే కాదు పాటలు కూడా పాడుతాడు. తెలుగు మాట్లాడేవాళ్ళని మనం వదలం. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు. సర్దార్ ని కూడా గొప్పగా తీసుంటాడని నమ్ముతున్నాను. అక్టోబర్ 21న అందరూ థియేటర్ లో 'సర్దార్' చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.
 
హీరో కార్తి మాట్లాడుతూ, ఈ సినిమాని నాగార్జున గారు తెలుగు విడుదల చేయడం చాలా థ్రిల్ గా వుంది. సర్దార్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. తొలిసారి తండ్రి కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో. ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ జనరేషన్ కు తగ్గట్టుగా వుంటుంది. ఒక సినిమాలో రెండు జనరేషన్లు చూపించడం ఒక సవాల్. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అభిమన్యుడులో డిజిటల్ క్రైమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లే ఇందులో కూడా మన కళ్ళ ముందు వుండి, మనం పెద్దగా పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయాన్ని చూపించారు. సర్దార్ లో అది గొప్ప సర్ ప్రైజ్ గా వుంటుంది. రాశి ఖన్నా, రజీషా, లైలా అద్భుతంగా నటించారు. జార్జ్ కెమరా పనితనం బ్రిలియంట్ గా వుంటుంది. జీవి పప్రకాష్ కుమార్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు. నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది. దాదాపు పాన్ ఇండియా షూట్ చేశాం. దీపావళి కి ఖైధీ సినిమా వచ్చింది. ఈ దీపావళికి ఒక పండగలా క్రాకర్ లా సర్దార్ సినిమా రాబోతుంది. అక్టోబర్ 21న సర్దార్ వస్తోంది.  అందరూ తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.
 
రజిషా విజయన్ మాట్లాడుతూ.. గీతాంజలి చూసి నాగార్జున గారి అభిమానిగా మారిపోయా. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సర్దార్ దీపావళి కానుకగా అక్టోబర్ 21న వస్తోంది. ఇందులో ఇందిరా అనే పాత్రలో కనిపిస్తా. చాలా ప్రేమతో ఈ సినిమా చేశా. ప్రేక్షకులకు సర్దార్ పర్ఫెక్ట్ దీపావళి కానుక కాబోతుంది. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ వున్న స్పై థ్రిల్లర్ సర్దార్. ప్రేక్షకులని తప్పకుండా వినోదం పంచుతుంది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.
 
లైలా మాట్లాడుతూ.. సర్దార్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్, నేను నటించిన శివపుత్రుడు దీపావళికి విదుదలై ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు వస్తోంది. దీపావళి నా పుట్టిన రోజు కూడా. కార్తి గారు అద్భుతంగా నటించారు. మిత్రన్ గారు చాలా మంచి సినిమాని తీశారు. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.
 
రాకేందుమౌళి మాట్లాడుతూ.. మనం చేసే పని పదిమందికి పనికొస్తే చాలు వాళ్ళ మెచ్చుకోలుతో  అవసరం లేదు. ఇదీ సర్దార్ థీమ్.పిఎస్ మిత్రన్ అద్భుతంగా తీశారు. ఈ సినిమాని మాటలు రాయడం ఆనందంగా వుంది. కార్తి అన్నకి సర్దార్ మైల్ స్టోన్ గా నిలిచే సినిమా అవుతుంది'' అన్నారు