Widgets Magazine Widgets Magazine

బాహుబలి 2లో ప్రభాస్ వాటా చాలా తక్కువేనట.. ఎందుకనీ..?

హైదరాబాద్, శుక్రవారం, 12 మే 2017 (03:36 IST)

Widgets Magazine
ss rajamouli

ఎస్ఎస్ రాజమౌళి తీసిన అతి బారీ చిత్రం ది కంక్లూజన్ ఆదాయం శిఖరస్థాయికి చేరుకుంది. అలాంటి ఎపిక్ డ్రామా, కళ్ళు చెదిరే దృశ్యాలతో ఎవరైనా సినిమా తీస్తే దానిపై వచ్చే ఆదాయం కూడా అదే స్థాయిలోనే ఉంటుంది కదా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాుహుబలి2 దాదాపు రూ. 1400 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉందని అంచనా. భారతీయ సినిమా చరిత్రలో దీనికంటే మించిన బెంచ్ మార్క్ ప్రస్తుతానికయితే లేదు. ఈ సినిమా కలెక్షన్లను బీట్ చేయాలంటే మరో పదేళ్లు పడుతుందని నిపుణుల అంచనా. 
 
ప్రపంచం నివ్వెరపోయే వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్న బాహుబలి2 సినిమాలో భాగమైన స్టార్లకు ఎంత ఆదాయం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం మిమ్మల్ని షాక్‌కు గురి చేయవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో నటించి తన రేంజిని ఎక్కడికో తీసుకెళ్లిన కథానాయకుడు ప్రభాస్‌కి తక్కువ రెమ్యునరేషన్ దక్కిందంటే నిజంగా షాకే మరి. బాలీవుడ్‌లో అయితే మొత్తం చిత్రం బడ్జెట్‌లో అధికభాగం నటులకు వెళుతుంది. పైగా ఆర్జించిన లాభాల్లోనూ వారికి వాటా లభిస్తుంది. కాని దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఖర్చు, నటుల ఫీజులు నిష్పత్తికి అనుగుణంగా లాభాలు అందుతాయి.
 
ఇప్పుడు విషయానికి వద్దాం. బాహుబలి2 ఇప్పటికీ వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తోంది కాబట్టి దర్శకుడు రాజమౌళికి దర్శకత్వం వహించినందుకు గాను 28 కోట్లు ముట్టగా మొత్తం లాభాల్లో మూడింట ఒకవంతు కూడా తనకే అందనున్నాయి. మరో రెండు మూడు వారాల పాటు బాహుబలి2 ఇదేరకంగా ప్రభంజనం సృష్టించనుంది కాబట్టి రాజమౌళికి లాభాల్లో వాటాగా ఎంత వస్తుందో ఊహించడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. 
 
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హీరో కంటే ఎక్కువగా దర్శకుడికి రెమ్యునరేషన్, లాబాల్లో అధిక వాటా సాధిస్తున్న చరిత్ర రాజమౌళికి మాత్రమే దక్కింది.  ఉదా. కు అయిదువందల కోట్ల రూపాయల లాభం అంటే దాంట్లో మూడింట ఒక వంతు కింద 150 కోట్ల పైనే రాజమౌళి వాటా కిందికి వస్తుంది. ఈ లెక్కన బాహుబలి2 రన్ టైమ్‌లో రూ. 1500 కోట్లు సాధించిందంటే రాజమౌళికి దక్కే వాటా 450 కోట్లు. సినిమా విడుదలకు ముందే తయారీ ఖర్చులన్నీ టేబుల్ ప్రాఫిట్ కింద జమ అయ్యాయని చెప్పారు కాబట్టి రాజమౌళికి  సినిమా సంపాదించే ప్రతి పైసాలోనూ వాటా ఉన్నట్లే లెక్క. 
 
ఇది కలా నిజమా అర్థం కావడం లేదు.
 



Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'సాహో' తర్వాతనే ఏ డీల్ అయినా... రూ.18 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్!

'బాహుబలి' ప్రాజెక్టుతో జాతీయ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ ఒక్క చిత్రంతో ప్రభాస్ రేంజ్ ...

news

'బాహుబలి' రికార్డుల్ని బీట్ చేసేందుకు 'మెగా' పట్టు... MEKని కూడా పక్కనెట్టేస్తున్నారట...

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనిదేముంది. క్రింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి ...

news

హీరోయిన్లను నగ్నంగా చూసేందుకు వస్తున్నారనుకుంటున్నారా?: హీరోయిన్ మంజిమ

హీరోహీరోయిన్లకు ఫ్యాన్ క్లబ్ ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలోనే వుంటోంది. ఫ్యాన్స్ లేవనెత్తే ...

news

హీరోయిన్ల నగ్న, కురుచ దుస్తుల కోసం కాదు.. కథ బాగుంటే వస్తారు: మంజిమ

ప్రేమమ్ తెలుగు రీమేక్ "సాహం శ్వాసగా సాగిపో'' సినిమాలో నటించి...తెలుగు ప్రేక్షకులకు ...