శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (13:31 IST)

ఏపీ సర్కారుకు జబర్దస్త్ నటుడు హెచ్చరిక.. చింతామణిపై నిషేధం ఎత్తివేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 'జబర్దస్త్' నటుడు అప్పారావు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణం ఈ నాటకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పైగా, ఈ చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. గత 1920లో చింతామణి నాటకాన్ని కాళ్లకూరి నారాయణ రావు రాశారని చెప్పారు. ప్రభుత్వాలు కళలను, కళాకారులను ప్రోత్సహించాలేగానీ, ఇలా నిషేధం విధించడం సబబు కాదన్నారు. 
 
అంతేకాకుండా, చింతామణి నాటకంపై నిషేధం విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతూ విశాఖపట్టణంలోని మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన దిగారు. ఇందులో జబర్దస్త్ నటుడు అప్పారావు కూడా పాల్గొని ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతామణి నాటకానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. 1920లో మహాకవి కాళ్ళకూరి నారాయణ రావు ఆ నాటకాన్ని రాశారని గుర్తు చేశారు. అలాంటి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. కళాకారులను, కళలను ప్రోత్సహించాలని, చింతామణి నాటకంపై నిషేధాన్ని ఎత్తేయాలని ఆయన కోరారు.