శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

జబర్దస్త్ కమెడియన్ ఇంట్లో విషాదం...

avinash anuja
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య అనూజకు అబార్షన్ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల తాను తండ్రిని కాబోతున్నట్టు అవినాష్ ఎంతో సంతోషంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన భార్య అనూజ గర్భందాల్చిన తర్వాత వీడియోలను, సీమంతం, ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే, ఇపుడు ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. 
 
తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశఆరు. తన భార్య అనూజకు అబార్షన్ అయినట్టు పేర్కొన్నారు. తమ బిడ్డను కోల్పోయినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేమని చెప్పారు. ఇకపై ఈ విషయంపై ఎవరూ ఎలాంటి ప్రశ్నలు వేయొద్దని, అలాగే వివరాలను ఆరా తీయొద్దని, చర్చ పెట్టొద్దంటూ కోరారు. 
 
"నా జీవితంలో సంతోషకర్మైన, బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే షేర్ చేసుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మనాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాం. కానీ, కొన్ని కారమాల వల్లే మేము జీర్ణించుకోలేక పోయాం. ఈ విషయం మేం ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధతతో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను" అని ముక్కు అవినాష్ ఇన్‌స్టాల్‌లో రాసుకొచ్చాడు.