'జబర్దస్త్' ప్రవీణ్ ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి
జబర్దస్త్ కమెడియన్, పటాస్ ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత గత కొన్ని నెలలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
కాగా, ప్రవీణ్ చిన్నతనంలోనే తల్లి చనిపోయారు. ఆయనతో పాటు తమ్ముడిని తండ్రి పెంచి పెద్దచేసిన సంగతి తెలిసిందే. తమ తండ్రి కష్టపడి పెంచారని ప్రవీణ్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోవడంతో ప్రవీణ్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా, జబర్దస్త్ టీమ్ సభ్యులు, ఆయన అనుచరులు ఆయనకు సానుభూతి తెలియజేస్తున్నారు.